Andrea Jeremiah: ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా సింగర్ కమ్ హీరోయిన్స్ అయితే చెప్పనవసరం లేదు. అందానికి అందం, గాత్రానికి గాత్రం వారి సొంతం. అలా రెండు కెరీర్లను మ్యానేజ్ చేస్తున్న హీరోయిన్స్ లో కోలీవుడ్ బ్యూటీ ఆండ్రియా జెర్మియా ఒకరు. ఈ చిన్నది.. ఒకపక్క హీరోయిన్ గా ఇంకోపక్క సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో రాఖీ, ఎవడు, తుపాకీ, యుగానికి ఒక్కడు, దడ లాంటి సినిమాలో హస్కీ వాయిస్ తో రొమాంటిక్ సాంగ్స్ పాడిన బ్యూటీ ఎవరో కాదు ఆండ్రియానే. ఇక ఇంకోపక్క హీరోయిన్ గా కూడా టాప్ పొజిషన్ లోనే ఉంది. ప్రస్తుతం ఈ చిన్నది. వెంకీ 75 గ వస్తున్న.. సైంధవ్ లో ఒక కీలక పాత్రలో నటిస్తుంది. అమ్మడికి సాంగ్స్, సినిమాలే కాదు.. సోషల్ మీడియాలో హీట్ పుట్టించడం కూడా తెలుసు. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో ఈ చిన్నది కుర్రకారును మత్తెక్కిస్తూ ఉంటుంది.
తాజాగా ఈ భామ బీచ్ ఒడ్డున మెరిసింది. అది కూడా బికినీలో. బీచ్ ఒడ్డున ఒక చెట్టుకు కట్టిన ఉయ్యాలా మీద బికినీతో కూర్చొని.. అందాలను ఆరబోస్తూ.. కుర్రాళ్లను కవ్వించింది. ఎల్లో కలర్ బికినీపై వైట్ టాప్ వేసి.. ఎద అందాలను ఒకపక్క.. థైస్ అందాలను ఇంకోపక్క ఆరబోసింది. చూడడానికి ఎంత క్యూట్ గా ఉందో అంతే హాట్ గా ఉంది. ఇక ఈ ఫోటోలు చూసి అభిమానులు ఆగుతారా.. సోషల్ మీడియాలో ట్రెండ్ చేసేశారు. మరి ఈ భామకు సైంధవ్ ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.