Andhra King Taluka : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా వస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ లాంటి మూవీ ఇప్పటి వరకు రాలేదన్నారు డైరెక్టర్ మహేవ్ బాబు పి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను మహేశ్ బాబు పి డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ మహేశ్ బాబు పి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
Read Also : Rakul Preet : వాళ్లను నమ్మొద్దు.. రకుల్ ప్రీత్ ట్వీట్
ఈ మూవీ టైటిల్ లో చాలా మీనింగ్ ఉంది. సినిమా చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఈ సినిమా 2002 టైంలో జరుగుతుంది. అందుకే ఆ టైటిల్ పెట్టాం. రానా గారు ఉపేంద్ర గారితో ఒక ఇంటర్వ్యూ చేయడం చూశాను. అందులో ఉపేంద్ర గారు ‘నేను బయటకంటే సినిమాలోనే రియల్ మనిషి’ అని చెప్పారు. ఆ మాట నాకు చాలా నచ్చింది. అందుకే ఈ సినిమాలో ఆంధ్రా కింగ్ పాత్రకోసం తీసుకున్నాను. సౌత్ ఇండియాలో హీరోస్ ని మన జీవితంలో ఒక అంతర్భాగంగా చూస్తాం. అందులో నాకు చాలా ఎమోషన్స్ కనిపించాయి. అలా ఆ ఇద్దరి రిలేషన్ లో ఒక కథ చెప్పొచ్చు అనిపించింది అన్నారు మహేశ్ బాబు.
ఈ సినిమా కథకు రామ్ చాలా ఎక్సైట్ అయ్యారు. రామ్ ఫస్ట్ సింగిల్ లోనే ఈ కథను ఓకే చేశారు. వెంటనే మైత్రీ మూవీస్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. నేను రాసుకున్న పాత్రకి గొప్ప ఎనర్జీ కావాలి. ఒక ఫ్యాన్ ఎలా బిహేవ్ చేస్తాడో ఎంత మాస్ గా ఉంటాడో అలాంటి పెర్ఫార్మర్ కావాలి. ఇలాంటి క్యారెక్టర్ కి రామ్ గారు పర్ఫెక్ట్ గా సూట్ అవుతారనే ఆయన్ను తీసుకున్నాను. ఇలాంటి కథ ఇప్పటి వరకు రాలేదని అనుకుంటున్నా. అందుకే సినిమాపై మంచి నమ్మకం పెరిగింది. కచ్చితంగా అందరికీ నచ్చతుంది అన్నారు మహేశ్ బాబు.
Read Also : I Bomma Ravi : చంచల్ గూడ జైలుకు ఐ బొమ్మ రవి
