Anchor Suma spitting on Hyper Aadi Face goes viral: ప్రస్తుతం ఢీ సెలబ్రిటీ స్పెషల్ షో జరుగుతున్న సంగతి తెలిసిందే. హైపర్ ఆది జడ్జ్ గా వ్యవహరిస్తూనే కామెడీ పంచ్ లతో, అల్లరి చేష్టలతో కామెడీ పుట్టిస్తున్నాడు. తాజాగా ఢీ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలయింది. ఇక ఈ ఎపిసోడ్ కి యాంకర్ సుమ అతిథిగా హాజరైంది. సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా నటించిన బబుల్ గమ్ సినిమా రీసెంట్ గా విడుదలయింది. ఆ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం సుమ, రోషన్, హీరోయిన్ మానస ఢీ షోకి హాజరయ్యారు. ఇక ఈ షోలో అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత సుభాష్, శేఖర్ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరించారు. ‘
Shobha Shetty: ప్రియుడితో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ
ఇక శ్వేత నాయుడు అనే కంటెస్టెంట్ మ్యాడ్ చిత్రంలోని పడితే లైన్లో పడతది అనే సాంగ్ కి అదిరిపోయే విధంగా పెర్ఫామ్ చేసి అందులో భాగంగా నోట్లో నీళ్లు పోసుకుని మళ్ళీ ఉమ్మేస్తూ చేసిన డ్యాన్స్ మూమెంట్ ఆకట్టుకుంది. ఆమె డ్యాన్స్ పై సుమ ఫన్నీగా స్పందించి నేను చెప్పిన మూమెంట్ ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి అని అడిగింది. మధ్యలో హైపర్ ఆది కలగజేసుకుని అంతగా చెబుతున్నారు కాబట్టి సుమ ఆ స్టెప్పులు వేస్తారని అన్నాడు. దీంతో సుమ డ్యాన్స్ చేస్తూ నోట్లో నీళ్లు పోసుకుని ఊస్తూ ఉండగా ఆ నీటిని హైపర్ ఆది బకెట్ తో పెట్టుకోవాలని చూస్తాడు. కానీ ఒకసారి సుమ ఏకంగా హైపర్ ఆది ముఖం మీద డైరెక్ట్ గా ఉమ్మేయడం హాట్ టాపిక్ అయింది. వాళ్ళు ఫన్నీగా చేసినప్పటికీ ఎందుకో ఇబ్బందికరంగా ఉంది.