Anchor Suma: మాట్లాడాలంటే వణికిపోతున్నారా? ఆ భయాన్ని పోగొట్టడానికి సుమ కొత్త అవతారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు బుల్లితెరపై తన మాటల గారడీతో దశాబ్దాలుగా ప్రేక్షకులను కట్టిపడేస్తున్న స్టార్ యాంకర్ సుమ కనకాల ఇప్పుడు సరికొత్త అవతారం ఎత్తారు. ఇప్పటివరకు నటిగా, యాంకర్‌గా, నిర్మాతగా తన సత్తా చాటిన ఆమె, ఇకపై ఒక ‘కోచ్’గా, ‘ట్రైనర్’గా మారబోతున్నారు. స్టేజ్ ఎక్కాలంటే వణుకు పుట్టేవారికి, నలుగురిలో ధైర్యంగా మాట్లాడలేక ఇబ్బంది పడేవారికి అండగా నిలిచేందుకు ‘Unmute with Suma – ధైర్యంగా మాట్లాడండి’ పేరుతో ఒక ప్రత్యేకమైన కోచింగ్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు నిర్వహించిన ప్రెస్ మీట్లో సుమ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ వర్క్‌షాప్‌ను ఏ భాషలో నిర్వహించాలనే దానిపై మొదట కాస్త తర్జనభర్జన జరిగిందని సుమ తెలిపారు. అయితే, తనకు ఇంతటి గుర్తింపును, జీవితాన్ని ఇచ్చింది తెలుగు భాషే కాబట్టి, ఈ ప్రయాణాన్ని తెలుగులోనే మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. స్కిల్ స్టూడియో ప్రో ఆధ్వర్యంలో జనవరి 24న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక రోజు వర్క్‌షాప్‌గా ఈ కార్యక్రమం జరగనుంది. 18 సంవత్సరాలు దాటిన వారందరికీ ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు.
చాలామంది తనను కలిసినప్పుడు “మీరు అంత ధైర్యంగా, స్పాంటేనియస్‌గా ఎలా మాట్లాడతారు?” అని అడుగుతుంటారని సుమ గుర్తుచేసుకున్నారు. దాని వెనుక ఉన్న అసలు రహస్యాన్ని బయటపెడుతూ.. “మనం ముందుగా అవతలి వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినాలి. ఎప్పుడైతే సరిగ్గా వినగలుగుతామో, అప్పుడే సమయస్ఫూర్తితో స్పందించగలం” అని తెలిపారు. కేవలం నోటికొచ్చింది మాట్లాడటం కాకుండా, మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటివారు వినాలనిపించేలా ఉండాలని, అందుకోసమే తన అనుభవాలన్నింటినీ డీకోడ్ చేసి ప్రత్యేక సిలబస్‌ను రూపొందించానని చెప్పారు. రాజకీయాలు, వ్యాపారం, యాంకరింగ్ ఇలా ఏ రంగంలో ఉన్నవారికైనా ఈ పబ్లిక్ స్పీకింగ్, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ స్కిల్స్ ఎంతో అవసరమని వివరించారు.
Also Read
- Salman Khan-Shraddha Kapoor: శ్రద్ధా కపూర్‌కు సారీ చెప్పిన సల్మాన్.. ఇంతకీ ఏం జరిగింది?
- Varanasi OTT Deal: ‘వారణాసి’ ఓటీటీ డీల్.. ఊహించని ధర!
- January 12 Vidudala నుంచి మొదటి సాంగ్ వచ్చేసింది.. డ్యాన్స్‌తో అదరగొట్టిన కీర్తి, కృతి!
- Sara Tendulkar Wedding: శుభ్‌మన్ గిల్ కాదు.. యువ హీరోతో సారా టెండూల్కర్ పెళ్లి?
గతంలో 8 నుంచి 18 ఏళ్ల వయసు వారి కోసం ఆన్లైన్లో ఈ కోర్సును ప్రారంభించగా, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి దాదాపు 300 మంది జాయిన్ అయ్యి అద్భుతమైన స్పందన అందించారని సుమ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనకు తెలుగును ఎంతో చక్కగా నేర్పించిన ప్రముఖ కార్టూనిస్ట్ బ్నింకి సుమ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. అయితే, దీనిపై బ్నిం స్పందించిన తీరు అక్కడున్న వారిని నవ్వుల్లో ముంచెత్తింది. “నేను సుమ గారికి మాటలు నేర్పించాననేది కేవలం పుకారు మాత్రమే. నిజానికి నేను ఆమెలా మాట్లాడలేను. అందుకే ఈ వర్క్‌షాప్‌లో నేనే జాయిన్ అవుతాను” అంటూ ఆయన చమత్కరించడం విశేషం.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
Anchor Suma: మాట్లాడాలంటే వణికిపోతున్నారా? ఆ భయాన్ని పోగొట్టడానికి సుమ కొత్త అవతారం
-
Akhilesh Yadav: కాంగ్రెస్‌తో పొత్తుపై అఖిలేష్ కీలక ప్రకటన.!
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Nabha Natesh : నన్ను క్షమించు అంటూ హీరోయిన్ తెలుగులో ప్రకటన.. అసలేమైంది?
-
AP Govt: ఒకవైపు పుష్కర ఏర్పాట్లు, మరోవైపు రిలయన్స్ ప్లాంట్ ప్రారంభం.. ఏపీలో డబుల్ ధమాకా..
ట్రెండింగ్
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!
-
Couple Attacked: పార్కులో ఫొటోలు దిగుతున్న జంటపై కర్రలతో దాడి.. అదుపులోకి 8 మంది మైనర్లు..!