యాంకర్ అనసూయ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి సుదర్శన్ రావు కన్నుమూశారు. తార్నాకలోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. సుదర్శన్ రావు చాలాకాలం పాటు కాంగ్రెస్ పార్టీ లో పని చేశారు. ఆయన వయసు 63 ఏళ్లు. సుదర్శన్ రావు చాలాకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఇప్పుడు ఆయన మరణానికి అదే కారణం అని తెలుస్తోంది. సుదర్శన్ ఆకస్మిక మరణం అనసూయ భరద్వాజ్, ఆమె కుటుంబ సభ్యులను కలచివేసింది. రాజీవ్ గాంధీ దేశాన్ని పాలిస్తున్నప్పుడు అనసూయ తండ్రి యూత్ కాంగ్రెస్ ప్రచార కార్యదర్శిగా పని చేశారు. ఆయనకు భార్య, అనసూయ, వైష్ణవి సహా ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గ్లామర్ ప్రపంచంలోకి అనసూయ ప్రవేశం గురించి అతను మొదట్లో అయిష్టంగానే ఉన్నాడు. తరువాత అతను అనసూయ ప్రతిభ, టీవీ యాంకరింగ్ మరియు ప్రెజెంటేషన్ పట్ల ఆమెకున్న మక్కువ కారణంగా ఒప్పుకోక తప్పలేదు. అనసూయ ఎప్పుడూ తన తండ్రి చాలా స్ట్రిక్ట్ అని చెప్పేది. ప్రస్తుతం అనసూయ కుటుంబం శోకంలో మునిగిపోయింది. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు అనసూయ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు.
Read Also : సితారకు ఆ సన్నివేశాలు అస్సలు నచ్చవు : మహేష్ బాబు
అనసూయ తండ్రి సుదర్శన్ ఓ వ్యాపారవేత్త. తన తల్లి పేరునే అనసూయకు పెట్టుకున్నాడు. అనసూయను ఆర్మీకి పంపాలని అనుకున్నారట. కానీ అనసూయ మాత్రం సినిమా ఇండస్ట్రీ వైపు మళ్లింది. అయితే అనసూయ లవ్ మ్యారేజ్ చేసుకోవడంతో ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేశారని అనసూయ చెప్పింది. అనసూయ ముందుగా ఓ న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా చేసి ఆ తరువాత యాంకర్ గా మారింది. మాటల్లో ఆమె చాతుర్యం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆ తరువాత నటనతోనూ అందరిని మెప్పించింది అనసూయ. ప్రస్తుతం ఆమె “పుష్ప” సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించనుంది.