Ananya Panday: బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే.. ఎన్నో ఆశలతో తెలుగులోకి అడుగుపెట్టింది.. పాపం ఏం ప్రయోజనం హిట్ ను అందుకోకపోగా విమర్శలను అందుకున్నది. లైగర్ లో ఆమె నటనను చూసి టాలీవుడ్ ప్రేక్షకులు తలలు బాదుకున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ సినిమా తరువాత అనన్య బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తోంది. ఒకపక్క సినిమాలతో బిజీగా ఉన్నా ఈ బ్యూటీ ఫోటోషూట్స్ మాత్రం ఆపడం లేదు. వరుస ఫోటోషూట్స్ తో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. ఇక ఈ భామ తాజాగా బజార్ మ్యాగజైన్ పై ఫోజులిచ్చింది.
బికినీపై బ్లాక్ కలర్ కోటు వేసి.. థైస్ అందాలను ఎరగావేసి కవ్విస్తోంది. ముఖ్యంగా అమ్మడి హెయిర్ స్టైల్ అయితే పూర్తిగా మార్చేసింది. దీంతో అనన్య కొత్తగా కనిపిస్తోంది. మొత్తానికి ఈ హాట్ బ్యూటీ అందాలు బజార్ మ్యాగజైన్ పై కళకళలాడుతున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం అనన్య పలు ప్రాజెక్ట్స్ తో బిజీగా మారింది.