Site icon NTV Telugu

Allu Arjun : బన్నీ-అట్లీ మూవీ.. రోజుకో హీరోయిన్ పేరు వినిపిస్తోందే..

Allu Arjun Atlee

Allu Arjun Atlee

Allu Arjun : అల్లు అర్జున్-అట్లీ మూవీపై రోజుకో రకమైన వార్తలు వస్తున్నాయి. ఈ మూవీని భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ మీద కళానిధి మారన్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ మూవీ కోసం భారీగా వీఎఫ్ ఎక్స్ వాడుతున్నారు. అమెరికాకు వెళ్లి మరీ హాలీవుడ్ వీఎఫ్ ఎక్స్ కంపెనీలతో మాట్లాడి వచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సైన్స్ పిక్షన్ మూవీగా తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే మూవీ గురించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తోంది. అందులోనూ హీరోయిన్ విషయంలో. ఆమెను తీసుకున్నారు.. ఈమెను తీసుకున్నారు అంటూ ఏదో ఒక వార్త. అప్పట్లో జాన్వీకపూర్ ను హీరోయిన్ గా తీసుకున్నారు అంటూ ప్రచారం జరిగింది.
Read Also : Ram Charan : పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ పాల్గొనేది అప్పుడే..

దాని తర్వాత మృణాల్ ఠాకూర్ పేరు. ఈమె అయితే దాదాపు ఫిక్స్ అన్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెరమదకు వచ్చింది. అనన్య పాండే దాదాపు ఫిక్స్ అయింది అంటూ బాలీవుడ్ మీడియా హైప్ ఇస్తోంది. భారీ ఛాన్స్ కొట్టేసిందంటూ అనన్యను మోస్తోంది. నిజంగానే అనన్య పాండేను తీసుకున్నారా లేదా అనేది తెలియదు. కానీ రోజుకో హీరోయిన్ పేరు మాత్రం వినిపిస్తోంది. ఒక్కోసారి ఏమో.. నలుగురు హీరోయిన్లను తీసుకుంటున్నారు అంటున్నారు. మూవీ యూనిట్ ఏదీ ప్రకటించకపోయినా.. ఈ రకమైన రూమర్లు మాత్రం నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి.
Read Also : Appanna Temple Incident : అప్పన్న సన్నిధిలో అపశృతి.. గోడకూలి ఏడుగురు మృతి

Exit mobile version