Ananya Pande : హీరోయిన్లకు ట్రోల్స్ అనేవి ఇప్పుడు కామన్ అయిపోయాయి. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే ఏదో ఒక టైమ్ లో బాడీ షేమింగ్ ను ఎదుర్కోవాల్సి వస్తోంది. తాను కూడా అలాంటి బాధితురాలినే అంటూ తెలిపింది అనన్య పాండే. లైగర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు. తిరిగి బాలీవుడ్ కు వెళ్లిపోయి అక్కడే సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని షాకింగ్ కామెంట్స్ చేసింది. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నా మీద కూడా బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు.
Read Also : War 2 : వార్-2ను ఆ సీన్లు దెబ్బ కొట్టాయి.. ఆర్జీవీ కామెంట్స్
చాలా మంది నీ హెడ్ లైట్స్ బాలేవంటూ దారుణంగా మాట్లాడారు. అవి నేను ఇప్పటికీ మర్చిపోలేదు. ఆ టైమ్ లో నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ గా నిలిచారు. అప్పటి నుంచి ఇలాంటివి పట్టించుకోవడం మానేశాడు. మనం ఎలా ఉన్నా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అలా అనేవారికి సాధించడం చేతకాదు. ఇతరులపై కామెంట్ చేయడానికి ఈజీగా ట్రై చేస్తారు అంటూ మండిపడింది అనన్య పాండే. ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అనన్య పాండేకు అవకాశాలు వస్తున్నా స్టార్ డమ్ మాత్రం రావట్లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాల్లో కీలక పాత్రలు చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
Read Also : Chiranjeevi : నానితో చిరంజీవి సినిమా అప్పుడేనా..?
