Site icon NTV Telugu

Pottel Trailer: అరాచకం అయ్యా.. అజయ్ నట విశ్వరూపం

Pottel Trailer

Pottel Trailer

Pottel Trailer: అనన్య కీలక పాత్రలో కనిపించనున్న సినిమా పొట్టెల్. టైటిల్ తోనే ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పరుచుకున్న ఈ సినిమాలో యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటించారు. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి మరియు ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. తెలంగాణ సరిహద్దు దగ్గర యువకృష్ణ తన కుమార్తెతో వేచి ఉండటంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. టీచర్ వచ్చినప్పుడు, తండ్రి కుమార్తె ఇద్దరూ అతని కాళ్ళపై పడి, ఆమెకు చదువు చెప్పమని వేడుకుంటారు.

Also Read: Deepavali: దీపావళి రిలీజ్ సినిమాలు ముందు రోజుకు షిఫ్ట్.. ఎందుకంటే?

ఇంతలో బలి ఇవ్వడానికి సిద్ధం చేస్తున్న పొట్టేల్ దొంగిలించబడింది. ఆగ్రహించిన గ్రామస్తులు, పటేల్ అజయ్ నేతృత్వంలో, హీరో కుటుంబంపై దాడి చేస్తారు. అజయ్ పొట్టేల్కు బదులు ఆ పాపను బలి ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో డిప్రెషన్‌లో ఉన్న హీరో తన ప్రాణాలను తీయడానికి ప్రయత్నించడంతో ట్రైలర్ ముగుస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ప్రశ్నిస్తూనే విద్య యొక్క ప్రాముఖ్యత గురించి సినిమాలో చర్చించినట్టు ట్రైలర్ లో క్లారిటీ వచ్చింది. దర్శకుడు సాహిత్ మోత్ఖూరి ప్రతి పాత్రను ఆకట్టుకునేలా రాసుకున్నట్టు అనిపించింది. అజయ్ తన ఆశ్చర్యకరమైన స్త్రీ రూపంతో టెరిఫిక్ పాత్రలో ఆకట్టుకున్నాడు. విక్రమార్కుడు తరువాత ఆయనకు ఒక మంచి పాత్ర పడిందని చెప్పొచ్చు

Exit mobile version