టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగల్ల పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇప్పుడు తంత్ర అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి టాక్ ను సొంతం చేసుకుంది..ఒకవైపు హీరోయిన్గా చేస్తూనే, సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో కూడా నటిస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. లేటెస్ట్ ఫొటోలతో యువతకు పిచ్చెక్కిస్తుంది.. సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది.. ఇక తాజాగా తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి ఎలాంటి క్లాలిటీస్ ఉండాలో చెప్పింది..
సాదారణంగా అమ్మాయిలు తమకు కాబోయే అబ్బాయిలు హైట్, వెయిట్, మంచి ఫిజిక్, గ్లామర్ ఇలా ప్రతీది తమకు నచ్చేలా ఉండాలనుకుంటారు.. కొందరు మంచి సౌండ్ పార్టీ అయితే చాలు అనుకుంటారు. కొంతమంది ఉద్యోగాన్ని ప్రేమిస్తారు.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు.. అలాగే హీరోయిన్ అనన్య కూడా తనకు కాబోయే భర్తకు ఆ ఒక్కటి ఉంటే చాలు పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసింది.
ఈ అమ్మడు పెళ్లి చేసుకునే వాడికి డిఫరెంట్ గా హీరోల్లాగా సిక్స్ ప్యాక్ లు, హెయిర్ స్టైల్స్ లు, కలర్ లు పెద్దగా ఉండాల్సిన పనిలేదట. గడ్డం బాగా ఉంటే చాలట.. ఆ హీరోయిన్ పెళ్లి చేసుకునే వాడికి పుల్ గా బీయర్డ్ ఉండాలట. అంతే కాదు అందంగా మీసకట్టు కూడా ఉండాలిట. ఈ రెండు ఉంటే చాలు నేను ప్లాట్ అయిపోతానంటోంది బ్యూటీ.. ఇక ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ అవ్వాలని తెగ ప్రయత్నిస్తుంది.. ఇప్పటికే ఆరు సినిమాలు చేసి మంచి నటిగా పేరు సంపాదించింది…