Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్‌గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు – అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantha Sriram: టాలీవుడ్లో వైవిధ్యమైన పాటలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సినీ గీత రచయిత అనంత శ్రీరామ్. తాజాగా ఆయన ఎన్టీవీ పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు ఫిలిం నగర్ సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. బ్లాక్‌బస్టర్ మూవీ ‘కల్కి 2898 AD’ లో పురాణ ఇతిహాసాల పాత్రలను చూపించిన తీరుపై ఆయన స్పందించిన విధానం ఇప్పుడు సరికొత్త వివాదానికి దారితీసింది. ఈ పాడ్‌కాస్ట్‌లో ఆయన సినిమాల్లో తీసుకునే సృజనాత్మక స్వేచ్ఛపై మాట్లాడుతూ.. పురాణాలను, ఇతిహాసాలను వెండితెరపై ఆవిష్కరించేటప్పుడు వాటి మూలాలను మార్చడం సరికాదని కుండబద్దలు కొట్టారు.
“ఇతిహాసాలు అంటే జరిగినది అలాగే చూపించాలి. ముఖ్యంగా మహాభారతంలోని అర్జునుడు – కర్ణుడు వంటి పవర్ఫుల్ పాత్రల విషయంలో చూపించిన కొన్ని మార్పులు సరైనవి కావు” అని ఆయన తన వ్యక్తిగత అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వ్యక్తపరిచారు. కల్కి సినిమాలో కర్ణుడి పాత్రను ఎలివేట్ చేసిన విధానంపై గతంలోనూ భిన్నమైన చర్చలు జరగ్గా.. అనంత శ్రీరామ్ కామెంట్స్‌తో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో రైటర్స్ పడే ఇబ్బందులు, కమర్షియల్ విలువలపై ఆయన మరింత ఘాటుగా స్పందించారు. “డబ్బులు ఇస్తే సినిమాకు పాటలు, మాటలు రాస్తాను కానీ.. ఇతిహాసాల మూలాలను మార్చేసే కొన్ని తప్పుడు మార్పులకు మాత్రం నేను ఎట్టిపరిస్థితుల్లోనూ కలం పట్టను” అంటూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు. సృజనాత్మక స్వేచ్ఛ పేరుతో చరిత్రను, పురాణాలను వక్రీకరించడాన్ని తాను అంగీకరించనని తేల్చి చెప్పారు. ప్రస్తుతం అనంత శ్రీరామ్ చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!