Punjabi Debut: మరో భాషా చిత్రంలోకి అమైరా దస్తుర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punjabi Debut: Amyra Dastur in another language film!
ఇప్పటికే తెలుగు, హిందీ, తమిళ భాషల్లో పలు చిత్రాలలో నటించింది అమైరా దస్తుర్. తెలుగులో ఆమె ‘మనసుకు నచ్చింది’, ‘రాజుగాడు’ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమాలో సందీప్ కిషన్ హీరోకాగా, రెండో దానిలో రాజ్ తరుణ్. విశేషం ఏమంటే ఈ రెండు సినిమాలను మహిళా దర్శకులే తెరకెక్కించారు. మంజుల ఘట్టమనేని ‘మనసుకు నచ్చింది’ చిత్రాన్ని రూపొందించగా, జర్నలిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ సంజనారెడ్డి ‘రాజుగాడు’ను తీశారు. మోడల్ గా, యాక్టర్ గా దేశవ్యాప్తం గుర్తింపు సంపాదించుకున్న అమైర దస్తుర్ ఇప్పుడు పంజాబీ భాషలోకి అడుగుపెడుతోంది. జెస్సీ గిల్ హీరోగా, అమర్ హుందాల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘పుర్టీలా’ సినిమాలో అమైర దస్తుర్ నటిస్తోంది. ఈ తరం యువత మనోభావాలకు దగ్గరగా ఉండే న్యూ ఏజ్ మూవీ ఇదని అమైరా తెలిపింది. ఈ తరహా సినిమాలో నటించాలనే కోరిక ఎప్పటి నుండో ఉందని, కానీ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం ఉండేదని, అయితే ఇప్పుడు విభిన్నమైన చిత్రాలు రావడం మొదలైన తర్వాత ధైర్యంతో ఈ ప్రాజెక్ట్ ను టేకప్ చేశానని ఆమె తెలిపింది. అమైరా ఎంట్రీతో ఆ చిత్ర బృందం కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తోంది.
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
తాజావార్తలు
-
Sonam Wangchuk: ప్రభుత్వ హామీతో.. నిరాహార దీక్షను విరమించిన సోనం వాంగ్‌చుక్
-
Astrology: జూలై 24 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు.. ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?