Site icon NTV Telugu

‘హను మాన్’ హీరోయిన్ ను పరిచయం చేసిన విజయ్ సేతుపతి

Hanuman

యంగ్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ‘హను-మాన్’. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇంతకుముందు ఈ సినిమాలో నుంచి విడుదలైన తేజ ఫస్ట్ లుక్ అందరినీ విస్మయానికి గురి చేసింది. ఈ రోజు ‘హను-మాన్’ హీరోయిన్ అమృత అయ్యర్ ను మీనాక్షిగా పరిచయం చేశారు స్టార్ హీరో విజయ్ సేతుపతి. ఫస్ట్ లుక్ పోస్టర్ ను విజయ్ సేతుపతి విడుదల చేస్తూ చిత్రబృందానికి విషెష్ తెలియజేశారు.

Read Also : నిద్ర లేచింది ‘పురుష లోకం’.. సమంత సాంగ్ పై కేసు

ఫస్ట్ లుక్ లో అమృత అయ్యర్ వైట్ ఎత్నిక్ వేర్‌లో మీనాక్షిగా పోస్టర్‌లో మిరుమిట్లు గొలుపుతుండగా, నేపథ్యం విజువల్ ఫీస్ట్‌గా ఉంది. ఆమె చిన్న పడవలో ప్రయాణిస్తుండగా, చేపలు పక్షుల్లా ఎగురుతూ ఫాంటసీ లోకాన్ని చూపిస్తున్నాయి. ఇది ఫాంటసీ ప్రపంచం అంజనాద్రిలోని మీనాక్షి ఉన్న అందమైన స్థలాన్ని చూపిస్తోంది. ‘హను-మాన్’ మొదటి ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో సినిమా అన్న సంగతి తెలిసిందే. కె నిరంజన్ రెడ్డి తన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version