Amrita Rao: గుట్టుచప్పుడు కాకుండా ప్రియుడిని పెళ్లాడిన మహేష్ హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాహ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మెప్పించిన హీరోయిన్ అమృతరావు. ఇక తెలుగులో మహేష్ బాబు సరసన అతిధిలో నటించిన అమ్మడు.. ఈ సినిమా తరువుత టాలీవుడ్ లో కనిపించలేదు. సినిమా విజయాన్ని అందుకోలేకపోయిన అమ్మడికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక బాలీవుడ్ కే పరిమితమైన ఈ భామ ఆర్జే అన్మోల్ తో పీకల్లోతు ప్రేమలో పడి .. ఇంట్లో తెలియకుండా పెళ్లి చేసుకున్నదట. ఇటీవల తన భర్త ఆర్జే అన్మోల్ తో కలిసి తన సొంత యూట్యూబ్ ఛానెల్ లో తన సీక్రెట్ పెళ్లి గురించి ఈ జంట చెప్పుకొచ్చారు.
2013 నుంచి వీరి మధ్య ప్రేమాయణం నడుస్తుండేదట.. స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలో అమ్మడికి పెళ్లి ప్రపోజల్ చేశాడట అన్మోల్.. ఆ సమయంలో పెళ్లి చేసుకోవాలా.. వద్ద అనే డైలమా ఉండేదని, దానికి అన్మోల్ ఒక ప్లాన్ చెప్పాడని చెప్పింది. ఇంట్లో ఎవరికి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేయుకుందామని, కెరీర్‌కు కూడా ఎలాంటి ఢోకా ఉండదని చెప్పడంతో టక్కున అమృత ఒప్పుకున్నదట. అలా 2014లో మే 15న జరిగిందని, రెండేళ్లు ఈ సీక్రెట్ పెళ్లిని దాచి ఉంచామని చెప్పుకొచ్చారు. ఆ తరువాత 2016 లో అధికారికంగా తాము బార్యాభర్తలమని ప్రకటించామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
తాజావార్తలు
-
Kane Williamson: అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ప్లేయర్ గుడ్‌బై.. 16 ఏళ్ల గొప్ప కెరీర్‌కు ముగింపు
-
Kerala: కన్న బిడ్డను చంపిన తల్లి నిర్దోషి.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు! అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లే..
-
Peddi Team: కోడి రామ్మూర్తి నాయుడు వారసుడి ఇంటికి ‘పెద్ది’ టీమ్
-
Jaishankar: యూరప్ అహంకారంపై భారత్ దెబ్బ.. జైశంకర్ సమాధానంతో సైలెంట్..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!