యంగ్ హీరో శర్వానంద్ , రీతూ వర్మ ప్రధాన పాత్రలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిక్షన్ డ్రామా చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శర్వానంద్ తల్లి పాత్రలో అమల అక్కినేని నటించారు. శర్వానంద్ తన ల్యాండ్ మార్క్ 30వ చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఈ చిత్రం నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న “అమ్మ” పాట ఇప్పుడు విడుదలైంది. అఖిల్ తన తల్లి అమల అక్కినేని నటించిన ‘అమ్మ పాటను విడుదల చేశారు. ఈ పాటలో ఒక కొడుకు తల్లితో తన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు.
Read Also : వైరల్ : హార్దిక్ పాండ్యా ‘శ్రీవల్లి’ స్టెప్… గ్రానీతో స్టైల్ గా…
ఈ పాటకు జేక్స్ బిజోయ్ అందించిన ఆహ్లాదకరమైన కంపోజిషన్‌తో ఎమోషనల్ గా, హృదయాన్ని హత్తుకునేలా ఉంది. అయితే సిద్ శ్రీరామ్ తన మనోహరమైన గానంతో మనల్ని మరో ప్రపంచానికి తీసుకెళతాడు. ఈ పాట ప్రధాన ఆకర్షణ లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం. కాగా ‘ఒకే ఒక జీవితం’ సినిమా టీజర్‌కు మంచి బజ్ వచ్చింది. ఇప్పుడు ‘అమ్మ’ పాట విడుదలైన వెంటనే వైరల్ అయ్యింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు మేకర్స్.