బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ తన సొంతింటిని అమ్మేశారు. సౌత్ ఢిల్లీలో ఉన్న ఆ ఇంటికి సోఫాన్ అని పేరుపెట్టిన అమితాబ్ ఆయన చిన్నతనం మొత్తం అక్కడే గడిపారు. హీరో కావాలని ముంబైలో అడుగుపెట్టేవరకు తల్లిదండ్రులు హరివంశ్ రాయ్ బచ్చన్, తేజి బచ్చన్ తో కలిసి అక్కడ నివసించారు. అమితాబ్ హీరోగా ఎదిగి ఎంత సంపాదించినా ఆ ఇంటిని కంటికి రెప్పలా చూసుకున్నారు. అయితే తాజాగా ఆ ఇంటిని బిగ్ బి అమ్మేశారు నెజోన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈవో అవని బడెర్ సుమారు రూ.23 కోట్లు వెచ్చించి సోఫాన్ ని సొంతం చేసుకున్నారు. అవని బడెర్, అమితాబ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్.
సోఫాన్ కి దగ్గర్లోనే అవని కుటుంబం కూడా నివసించేది. దీంతో ఆయన తన సోఫాన్ ని బాగా చూసుకుంటారనే నమ్మకంతోనే బిగ్ బీ తన ఇంటిని అమ్మినట్లు తెలుస్తోంది. ఇక ముంబై లో అమితాబ్ కి ఐదు పెద్ద భవనాలు ఉన్న సంగతి తెలిసిందే. జనక్, జల్సా, ప్రతీక్ష, వత్స, అమ్మ వాటి పేర్లు. వీటిలో ఒక బంగ్లాలోనే బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ అద్దెకు ఉంటుంది. అయితే అస్సలు సొంత ఇంటిని అమ్మాల్సి అవసరం అమితాబ్ కి ఏం వచ్చింది అని పలువురు ఆరా తీస్తున్నారు.