‘రంగ్ దే బసంతీ, భాగ్ మిల్కా భాగ్’ వంటి చిత్రాలతో టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా. అయితే, ఆయన కెరీర్ మొదలైంది ‘అక్స్’ సినిమాతో. అందులో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ నటించాడు. ఇక అప్పటి దాకా బిగ్ బి ఎన్నడూ చేయని ఓ ప్రయోగం రాకేశ్ తన తొలి చిత్రంలోనే చేయించాడు. అమితాబ్ చేత ‘ఫ్రెంచ్ బియర్డ్’ పెట్టించాడు! ఆ లుక్ ‘అక్స్’ సినిమాలో సెన్సేషన్ గా నిలిచింది. జనం కొత్త రకం గడ్డంతో బీ-టైన్ ‘షెహన్ షా’ని అద్భుతంగా ఆదరించారు. బచ్చన్ కూడా ‘అక్స్’ తరువాత ఫ్రెంచ్ బియర్డ్ లుక్ అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చాడు…
Read Also : సెప్టెంబర్ లో “సైమా” అవార్డ్స్
అమితాబ్ బచ్చన్ గడ్డం సంగతి స్వయంగా రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రానే చెప్పాడు. రీసెంట్ గా ఆయన ఓ బుక్ రాశాడు. సోనమ్ కపూర్ చేతుల మీదుగా విడుదలైంది. మెహ్రా డెబ్యూ బుక్ లో ఆయన తనతో పని చేసిన అనేక మంది బాలీవుడ్ సెలబ్రిటీల గురించి ఆసక్తికర అంశాలు పాఠకులతో పంచుకున్నాడు. ఆ క్రమంలోనే అమితాబ్ స్పెషల్ బియర్డ్ గురించి చెప్పాడు. అంతే కాదు, అప్పుడు తాను కొత్త దర్శకుడ్ని అయినా బిగ్ బి బిగ్ హార్ట్ తో తన సలహా పాటించాడని గతం గుర్తు చేసుకున్నాడు!