Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Amitabh Bachchan Has Faced Many Accidents In His Career

Amitabh Bachchan: అమితాబ్ కు యాక్సిడెంట్ అయితే…!?

Published Date :March 7, 2023 , 10:46 pm
By Prasanna Pradeep
Amitabh Bachchan: అమితాబ్ కు యాక్సిడెంట్ అయితే…!?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Amitabh Bachchan: ఆల్ ఇండియా సూపర్ స్టార్ గా జేజేలు అందుకున్న అమితాబ్ బచ్చన్ కు ప్రమాదాలు కొత్త కాదు. ఇప్పుడు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ప్రాజెక్ట్ కే’ షూటింగ్ లో మరోమారు అమితాబ్ ప్రమాదానికి గురయ్యారు. అసలు అది ప్రమాదమే కాదు అన్నట్టుగా తొలుత వినిపించింది. స్వయంగా అమితాబ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో జరిగిన సంఘటనను వివరించాక, నిజమే అనుకున్నారు. ఏదో చిన్న ప్రమాదమట అంటూ కొందరు చాటింపు వేశారు. నిజానికి అది మేజర్ ఇంజురీ అని తెలుస్తోంది. ఎందుకంటే రిబ్స్ కు బలమైన దెబ్బ తగిలింది. ఛాతీ ఎముకలకు ఏ విధమైన గాయం తగిలినా, కోలుకొనేందుకు ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాదు, విశ్రాంతి మినహా ఆ దెబ్బలకు సరైన చికిత్స లేదనే చెప్పాలి. అందువల్ల ఈ సారి అమితాబ్ కు జరిగిన ప్రమాదం చిన్నదే అంటూ కొట్టిపారేయడానికి లేదు. అందువల్ల అమితాబ్ అభిమానులందరూ ఆయన మళ్ళీ ఎప్పటిలా తిరగాలని ప్రార్థిస్తున్నారు. అమితాబ్ సైతం ప్రేక్షకుల దీవెనలే తనకు అసలైన వైద్యం అనీ భావిస్తున్నారు.

అమితాబ్ బచ్చన్ కెరీర్ లో పలు ప్రమాదాలు ఎదుర్కొన్నారు. వాటిలో ప్రమాదకరమైనవీ ఉన్నాయి. ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొన్నవీ లేకపోలేదు. అమితాబ్ బచ్చన్ ను స్టార్ గా నిలిపిన చిత్రం ‘జంజీర్’. ఆ సినిమాలో డూప్ లేకుండా అమితాబ్ చేసిన ఫైట్స్ ఆ రోజుల్లో జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమా సమయంలో అమితాబ్ వయసు అక్షరాలా 31 సంవత్సరాలు. ఆ వయసు వేగంతో తరువాత కూడా అమితాబ్ బచ్చన్ డూప్ లేకుండానే ఫైట్స్ చేస్తూ సాగారు. కొన్నిసార్లు రిస్కీ షాట్స్ లోనూ హుషారుగా పాల్గొని అలరించారు. ‘డాన్’ సినిమా షూటింగ్ సమయంలో అమితాబ్, హీరోయిన్ జీనత్ అమన్ మధ్య ఓ చేజ్ ఉంటుంది. ఆ సమయంలో ఆయన ఎగురుతూ సరైన టైమింగ్ లో ల్యాండ్ కాలేక పోయారు. దాంతో మెడ భాగంలో గాయమయింది. ఇప్పటికీ అది అప్పుడప్పుడూ సలుపుతూనే ఉంటుంది. ఆ సమయంలో నెక్ బ్రేస్ వేసుకుంటూ ఉంటారు అమితాబ్. ఈ విషయాన్ని ‘పికూ’ షూటింగ్ సమయంలో బయట పెట్టారు అమితాబ్.

‘డాన్’ తరువాత ‘కూలీ’ సినిమా షూటింగ్ బెంగళూరులో జరుగుతూ ఉండగా, యాక్షన్ సీన్ చిత్రీకరణలో అమితాబ్ ఉదరంలో బలమైన గాయమైంది. ఆ సమయంలో అమితాబ్ బచ్చన్ కోలుకోవడం కష్టం అన్నారు. అయితే ఆయన ఆత్మస్థైర్యం, అభిమానుల ప్రార్థనలు ఫలించి, మళ్ళీ కోలుకున్నారు. ‘కూలీ’ సినిమా సమయంలో అమితాబ్ కు జరిగిన యాక్సిడెంట్ మేజర్ అని ఇప్పటికీ చెప్పుకుంటారు. హైదరాబాద్ లో ‘ప్రాజెక్ట్ కె’ షూటింగ్ జరుగుతూ ఉండగా, జరిగిన ప్రమాదం కూడా ‘మేజర్’ అనే అంటున్నారు. కానీ,కొందరు కాదని కొట్టి పారేస్తున్నారు. ఇక్కడ ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి, ప్రస్తుతం అమితాబ్ వయసు 80 సంవత్సరాలు. ఈ వయసులో పక్కటెముకలకు బలమైన గాయం అంటే చిన్న విషయం కాదు. ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ ఎప్పటిలా నవ్వుతూ షూటింగ్ కు వస్తారని ‘ప్రాజెక్ట్ కే’ చిత్ర బృందం ఆశిస్తోంది. అమితాబ్ కు ప్రమాదం జరిగిన ‘డాన్, కూలీ’ సినిమాలు సూపర్ హిట్ అయినట్టే, ఈ ‘ప్రాజెక్ట్ కే’ సైతం విజయఢంకా మోగిస్తుందనీ అభిమానులు అంటున్నారు.

“డాన్, కూలీ” చిత్రాలే కాదు, అమితాబ్ నటించిన మరికొన్ని సినిమాల్లోనూ ప్రమాదాలకి గురయ్యారు. అయితే వాటిని అమితాబ్ అంతగా చెప్పుకోలేదనీ ఆయన సహ నటులు అంటున్నారు. ‘మేజర్ సాబ్’ సమయంలోనూ ఆయన ప్రమాదానికి గురైనా, దానిని లెక్క చేయకుండా షూటింగ్ లో పాల్గొన్నారని అజయ్ దేవగన్ గుర్తు చేసుకున్నారు. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ ప్రోగ్రామ్ షూటింగ్ సమయంలోనూ అమితాబ్ బచ్చన్ కాలికి అనుకోకుండా గాయమైంది. ఓ ఇనుపముక్క కారణంగా నరం తెగడంతో రక్తం ధారగా చాలాసేపు కారింది. వైద్యులు సరైన చికిత్స చేయడం వల్ల ప్రమాదం తప్పిందని అప్పట్లో అమితాబ్ తెలిపారు. ‘తీన్’ సినిమా షూటింగ్ లోనూ కింద పడడం వల్ల రిబ్స్ కు గాయమైంది. అయితే అది అంత బలమైనది కాకపోవడంతో కొద్ది రోజులకే కోలుకున్నారు అమితాబ్. ‘కూలీ’ సమయంలో ప్రమాదం నుండి బయటపడ్డ అమితాబ్ ను అందరూ ‘మృత్యుంజయుడు’ అని కీర్తించారు. ఈ సారి కూడా అమితాబ్ అలాగే కోలుకుంటారని ఆశిద్దాం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amitabh Bachchan
  • Amitabh Bachchan accidents
  • Amitabh Bachchan news
  • Bollywood News

తాజావార్తలు

  • YS Jagan: అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు.. ఇది శుభపరిణామం..!

  • OnePlus Magnetic Ice Cooling Clip: గేమర్లకు గిఫ్ట్.. ప్రపంచంలోనే సన్నని OnePlus స్మార్ట్‌ఫోన్ కూలర్ వచ్చేసింది

  • TGSRTC: పెట్రోల్ కష్టాల వేళ గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్టీసీ.. ఆ బస్సుల్లో టికెట్టుపై భారీగా డిస్కౌంట్

  • RR Captain 2026: రాజస్థాన్ రాయల్స్‌కు కొత్త యాజమాన్యం.. కెప్టెన్‌గా యశస్వి జైస్వాల్‌, నిజమేనా?

  • Medchal: కన్న తల్లిని కిరాతకంగా చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన కుమార్తె.. ఏడాది తర్వాత బయటపడ్డ నిజం!

ట్రెండింగ్‌

  • Rama Navami 2026: సత్యం, ధర్మానికి ప్రతీక.. శ్రీరాముడి జీవితం నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలు ఇవే..

  • Viral Video: మరీ ఇలా ఉన్నారేంట్రా!.. కుక్కర్లు, పాత్రలు, బకెట్లలో పెట్రోల్ తీసుకెళ్తున్న జనాలు..

  • RCB Sale Price: ఐపీఎల్ చరిత్రలో మరో సంచలన డీల్.. ఆర్‌సీబీ కొత్త ఓనర్స్ ఎవరంటే?

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions