Kalki 2898 AD Update tomorrow: ది మచ్ అవైటెడ్ కల్కి 2898 AD మూవీ నుంచి రేపు అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్. అయితే అది రిలీజ్ డేట్ అప్డేట్ అనుకుంటే పొరపాటే. ఈ సినిమాలో అమితాబ్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్రతో పాటు ఫస్ట్ లుక్ రేపు స్టార్ స్పోర్ట్స్ ప్రోగ్రాంలో రివీల్ చేస్తున్నట్టు ప్రకటించారు. కల్కి 2898AD సినిమా 2024 మే 9న రిలీజ్ అవుతుంది అని కొన్నాళ్ల క్రితం ప్రకటించారు. అప్పట్లో కల్కి 2898 ఆన్ మే 9 అనే ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. వైజయంతి మూవీస్ బ్యానర్ కి మే 9వ తేదికి దశాబ్దాల అనుబంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇండస్ట్రీ హిట్ సినిమా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా తుఫానుకి కూడా ఎదురు నిలిచింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన మోడరన్ క్లాసిక్ ‘మహానటి’ కూడా మే 9నే రిలీజ్ అయ్యింది.
Vishal : విజయ్ సినిమా డైరెక్ట్ చేసేందుకు విశాల్ యత్నం!
చివరగా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాతో వైజయంతి మూవీ మే 9న హిట్ కొట్టింది. ఇప్పటివరకూ మే 9న వైజయంతి మూవీస్ నుంచి వచ్చి సినిమాలు నెవర్ బిఫోర్ హిట్స్ గా మారాయి. ఈ సెంటిమెంట్ ని బిలీవ్ చేస్తూ 2024 మే 9న కల్కిని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు కానీ ఎన్నికలు ఆ ఆశలు అడియాసలు అయ్యేలా చేశాయి. మే 13 ఎన్నికలు కావడంతో ఆ ఎఫెక్ట్ తో సినిమాను వాయిదా వేశారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాల్సి ఉంది. ఇక ఇక ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ కీ రోల్ ప్లే చేస్తుండగా… దీపికా పదుకొనె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. లోక నాయకుడు కమల్ హాసన్ విలన్‌గా నటిస్తున్నాడు. కల్కి 2898 AD ఇండియాస్ నెక్స్ట్ బిగ్ థింగ్ లా కనిపిస్తోంది. ఇప్పటికే భారీ హైప్ ఉన్న కల్కి మూవీని రిలీజ్ టైమ్ కి వరల్డ్ వైడ్ బజ్ జనరేట్ చేయడం గ్యారెంటీ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
𝐓𝐡𝐞 𝐭𝐢𝐦𝐞 𝐡𝐚𝐬 𝐜𝐨𝐦𝐞 𝐭𝐨 𝐤𝐧𝐨𝐰 𝐰𝐡𝐨 𝐡𝐞 𝐢𝐬!
Exclusively on @StarSportsIndia at 7:15 PM on April 21st.#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7@DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #IPLonStar pic.twitter.com/pFtsBYK9sR
— Kalki 2898 AD (@Kalki2898AD) April 20, 2024