NTV Telugu Site icon

Amit Shah: మరోసారి ఎన్టీఆర్ తో అమిత్ షా భేటీ?

Amit Shah Ntr

Amit Shah Ntr

Amit Shah to meet jr NTR again soon in Hyderabad: గత ఏడాది ఆగస్టు నెలలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ప్రముఖ హీరో ఎన్టీఆర్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మునుగోడు పర్యటనలో భాగంగా అమిత్‌ షా హైదరాబాద్‌ రాగా మునుగోడులో బీజేపీ సమరభేరి సభ ముగిసిన తర్వాత అమిత్‌ షా.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న నోవాటెల్‌ హోటల్‌లో ఎన్టీఆర్‌ తో సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు సమావేశం సాగిన వీరి సమావేశంలో ఏమి మాట్లాడుకున్నారో తెలియదు కానీ అప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఇక ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ ని, అమిత్ షా కలవబోతున్నారని మీడియాలో ప్రచారం మొదలైంది. త్వరలో తెలంగాణలో శాసన సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వార్తకి ప్రాధాన్యత సంతరించుకుంది.

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ హౌస్‌కి కొత్త కెప్టెన్‌గా శోభా.. భలే కాపాడేశావు బాసు!

నిజానికి బీజేపీ ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తెలంగాణలో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించగా అదే సమయంలో ఎన్టీఆర్ తో భేటీ హాట్ టాపిక్ అవుతోంది. ఎన్టీఆర్‌, అమిత్‌షా భేటీ తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారగా ఎన్నికలే లక్ష్యంగే ఈ మీటింగ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అగ్ర నాయకత్వం ఫోకస్‌ పెట్టిన నేపథ్యంలో రాజకీయంగా కూడా ఈ భేటీకి ప్రాధాన్యమేర్పడింది. భేటీ అనేది జరిగితే ఏయే అంశాలపై వీరిద్దరూ మాట్లాడుకోబోతున్నారు? రాజకీయ కారణాలా? ఇతర అంశాలా? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు. నిజానికి టీడీపీకి గతంలో ప్రచారం చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ ను అమిత్ షా కలవనుండడం హాట్ టాపిక్ అవుతుంది. .