అమెరికన్ సింగర్ బిల్లీ ఎలిష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఓసియన్ ఐస్’, ‘బ్యాడ్ గాయ్’, ‘వెన్ ది పార్టీ ఇస్ ఓవర్’ పాటలతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇండియా లో ఎక్కడ విన్నా ఈమె పాటలే వినిపిస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు. ఇక తాజాగా బిల్లీ ఎలిష్ ఒక ఇంటర్వ్యూ లో శృంగారంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. శృంగార వీడియోలు చూడడంలో తప్పు లేదు.. వాటిని చూసే తాను శృంగారం నేర్చుకున్నాను అంటూ బోల్డ్ గా మాట్లాడి అందరి దృష్టిలోనూ పడింది.
ఆ ఇంటర్వ్యూ లో బిల్లీ ఎలిష్ మాట్లాడుతూ ” నేను 11 ఏళ్ల వయస్సులో శృంగార వీడియోలు చూశాను .. దాని వలన నా జీవితం నాశనం అయ్యింది. అవి మనల్ని ప్రభివితం చేస్తాయి. నిజం చెప్పాలంటే ఆ వీడియోలు చూసే నేను శృంగారంను నేర్చుకున్నాను. ఈ వీడియోలను చూడడంలో తప్పు లేదు.. అంతేకాదు.. శృంగార వీడియోలు చూడడం ఒక రిలీఫ్ ని ఇస్తుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు.. భయం లేకుండా ఉండాలంటే నేను ఆ వీడియోలను చూసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా.. శృంగారం చెడ్డ విషయం కాదు .. దాని గురించి మాట్లాడడంలో నాకు ఎలాంటి సిగ్గు లేదు.. అందుకు నేను గర్వపడుతున్నాను.. అయితే వీటి వలన కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి.. హింసాత్మకమైన, అబ్యూసివ్ శృంగారం వీడియోలు చూడడం వలన అర్ధరాత్రి పీడ కలలు వస్తాయి.. వాటిని తట్టుకోవడం కష్టం అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ సింగర్ మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.