Ameesha Patel: ‘ఆంటీ’ అంటూ ట్రోల్.. హార్దిక్‌తో లింకప్ రూమర్స్‌పై అమీషా స్ట్రాంగ్ కౌంటర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ameesha Patel: టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఏదో ఒక నటితో డేటింగ్ చేస్తున్నాడనే పుకార్లు ఈ మధ్య నిరంతరం ప్రచారంలో ఉంటున్నాయి . ఇటీవల అతనికి 51 ఏళ్ల అమీషా పటేల్‌తో సంబంధం అంటగట్టారు నెటిజన్లు. వీరిద్దరి వీడియో ఒకటి బయటపడటంతో, సోషల్ మీడియాలో వారి సంబంధంపై చర్చలు మొదలయ్యాయి. టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, బాలీవుడ్ నటి అమీషా పటేల్ కలిసి ఒక పార్టీలో కనిపించడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా కొత్త రూమర్స్ మొదలయ్యాయి. ఆ పార్టీకి సంబంధించిన వీడియోలో అమీషా.. హార్దిక్‌ను తన స్నేహితులకు పరిచయం చేస్తూ కనిపించింది. ఈ సమయంలో ఆమె హార్దిక్ భుజంపై చేయి వేయడం సోషల్ మీడియా యూజర్ల కంట పడింది. అంతే.. ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.
అసలు ఈ వీడియోలో అంత ప్రత్యేకంగా ఏమీ లేకపోయినా, కొందరు నెటిజన్లు మాత్రం దానికి రొమాంటిక్ టచ్ ఇచ్చేశారు. ఒక యూజర్ హార్దిక్ భుజంపై అమీషా చేయి వేయడాన్ని చూపిస్తూ, రెడ్డిట్‌లో వస్తున్న రూమర్స్ నిజమేనంటూ పోస్ట్ చేశాడు. మరోవైపు కొందరు అమీషాను ‘ఆంటీ’ అంటూ కూడా ట్రోల్ చేశారు. దీంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో మరింత వైరల్ అయింది. ఈ ట్రోలింగ్ అమీషా పటేల్ దృష్టికి వెళ్లడంతో ఆమె ఏ మాత్రం తగ్గలేదు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆ పోస్టు స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసి వ్యంగ్యంగా స్పందించింది. హార్దిక్ భుజంపై చేయి వేసిన తన చర్య నిజంగానే చాలా రొమాంటిక్‌గా ఉందంటూ సెటైర్ వేసింది. అంతేకాదు, తనకు తెలియని వ్యక్తి కూడా ఇలా అర్థం చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందని, అతడికి కనీసం ఒక అమ్మాయి ఫ్రెండ్ కూడా లేదేమో అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.
Also Read
- Toxic OTT : రూ. 150 కోట్ల నుండి రూ. 30 కోట్లకు పడిపోయిన టాక్సిక్ OTT ఆఫర్!
- Toxic: యశ్ ‘టాక్సిక్’లో ఈ 9 ఏళ్ల బుడ్డోడు ఎవరో తెలుసా? రాకీ భాయ్ ఇచ్చిన గిఫ్ట్‌ల వెనుక అసలు కథ ఇదే!
- The Paradise : సెప్టెంబర్ 24న ప్యారడైజ్ రిలీజ్ ఫిక్స్.. చుట్టేస్తున్నారా?
- 2026 Tollywood : ఫేడౌట్ హీరోలకు కలిసివచ్చిన 2026.. వరుస ప్లాపుల తర్వాత దక్కిన ఊరట!
దీంతో హార్దిక్, అమీషా మధ్య డేటింగ్ జరుగుతోందంటూ వచ్చిన ప్రచారానికి అమీషా తనదైన స్టైల్లో చెక్ పెట్టినట్టైంది. కేవలం ఒక ఫ్రెండ్లీ మూమెంట్‌ను పట్టుకుని ప్రేమాయణం అంటగట్టడం సరికాదని ఆమె రిప్లై స్పష్టం చేసింది. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా మోడల్ మహీకా శర్మతో రిలేషన్లో ఉన్నట్లు వస్తున్న వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక అమీషా పటేల్ విషయానికి వస్తే.. 2023లో వచ్చిన ‘గదర్ 2’లో సకీనా పాత్రలో కనిపించిన ఆమె ఆ తర్వాత పెద్ద సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. అయితే ఇప్పుడు హార్దిక్‌తో లింకప్ రూమర్స్ కారణంగా మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
- Tags
- Ameesha Patel
- cinema
తాజావార్తలు
-
Ameesha Patel: ‘ఆంటీ’ అంటూ ట్రోల్.. హార్దిక్‌తో లింకప్ రూమర్స్‌పై అమీషా స్ట్రాంగ్ కౌంటర్!
-
TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
-
Uttam Kumar Reddy: పాదయాత్ర అంటే జనాలు నవ్వుతారు.. కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు.!
-
Auto Drivers Meet: ఆటో కార్మికులతో కీలక భేటీ.. సంక్షేమ బోర్డు, మీటర్ ఛార్జీలపై చర్చ!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
ట్రెండింగ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!