Vedha Jalandhar: ‘అమీర్ లోగ్’.. బిర్యానీ చుట్టూ తిరిగే కథ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో సహజత్వంతో కూడిన కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ పతాకంపై మాధవి రెడ్డి సోమ నిర్మించగా, రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అమీర్ లోగ్’. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని దగ్గుబాటి రానాకు చెందిన ప్రముఖ సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఆగస్ట్ 21న గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. ఈ సందర్భంగా చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన నటి వేధా జలంధర్ సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.
సినిమాలో తన పాత్ర గురించి వేధా జలంధర్ మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో నా క్యారెక్టర్ చాలా సహజంగా, పక్కింటి అమ్మాయిలా ఉంటూనే మహిళలకు స్ఫూర్తినిచ్చేలా ఉంటుంది. మా అమ్మ వ్యక్తిత్వమే నాకు స్ఫూర్తి. ముక్కుసూటిగా మాట్లాడటం, ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం ఇందులో కనిపిస్తుంది. ఆడిషన్స్ ద్వారా దర్శకుడు రమణ గారు నన్ను ఎంపిక చేసుకున్నారు. ఇందులో ప్రతి పాత్రకూ కథలో ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది” అని తెలిపారు.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
చిత్ర కథాంశం గురించి ప్రస్తావిస్తూ.. “‘అమీర్ లోగ్’ సినిమాలో బిర్యానీ అనేది ఒక కీలక పాత్రలా కథతో పాటు ప్రయాణిస్తుంది. లైవ్ లొకేషన్లలో సింక్ సౌండ్‌తో ఈ సినిమాను షూట్ చేశాం. బస్తీ ప్రజలు షూటింగ్‌కు ఎంతగానో సహకరించారు. స్మరణ్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమా స్థాయిని మరో పది మెట్లు పైకి తీసుకెళ్లింది. మేము తెరపై చూపించలేని ఎమోషన్లను ఆయన తన మ్యూజిక్‌తో పలికించారు” అని వివరించారు.
సినిమాలోని భాష, యాసల గురించి మాట్లాడుతూ.. “ఎమోషన్ అనేది ప్రపంచంలో ఎవరికైనా ఒకటే. అందువల్ల భాషా భేదం లేకుండా ప్రతి ఒక్కరికీ ఈ కథ కనెక్ట్ అవుతుంది. ఇప్పటికే సినిమా చూసిన స్పిరిట్ మీడియా టీమ్‌తో పాటు ప్రముఖ దర్శకుడు వి.ఎన్. ఆదిత్య గారు మా పాత్రలను, రమణ గారి రైటింగ్‌ను ఎంతగానో ప్రశంసించారు. ఆరేళ్ల సినీ ప్రయాణంలో ఎన్ని సినిమాలు చేశామనే నంబర్ కంటే, చేసిన పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో ఎంత గుర్తింపు తెచ్చుకున్నామనేదే నాకు ముఖ్యం” అని వేధా జలంధర్ స్పష్టం చేశారు. ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ పూర్తి ధీమా వ్యక్తం చేస్తోంది.
తాజావార్తలు
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
-
Telangana Agriculture : పప్పుధాన్యాల సాగులో తెలంగాణకు రెండో స్థానం.. కేంద్రానికి కీలక ప్రతిపాదనలు
-
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
-
Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
-
AI Driving Test : డ్రైవింగ్ పరీక్షల్లో ‘ఏఐ’ విప్లవం.. మానవ జోక్యానికి చెక్ పెడుతూ కీలక నిర్ణయం..!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!