Amazon Prime Announced Web Series with Similar Story Lines of Thandel- Matka: అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ నిన్న ఒక ఆసక్తికరమైన ఈవెంట్ లో అనేక సినిమాలో సిరీస్ లను ప్రకటించింది. థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత తమ ఓటీటీలో రిలీజ్ అయ్యే పలు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల అనౌన్స్మెంట్స్ తో పాటు తమ దగ్గర మాత్రమే ప్రసారమయ్యే పలు అమెజాన్ ఒరిజినల్స్, వెబ్ సిరీస్ లను కూడా ప్రకటించింది. ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో రెండు బడా సినిమాలకు తలనొప్పిగా మారింది. అసలు విషయం ఏమిటంటే ఇప్పటికే తెలుగులో నాగచైతన్య హీరోగా తండేల్, వరుణ్ తేజ్ హీరోగా మట్కా అనే సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇందులో నాగచైతన్య తండేల్ సినిమా విషయానికి వస్తే అనుకోకుండా అంతర్జాతీయ జలాల్లోకి వెళ్లి పాకిస్తాన్ నేవీ చేతుల్లో పడి అనేక ఇబ్బందులు పడి భారతదేశానికి తిరిగి వచ్చిన ఒక యువకుడి కథ. ఇప్పుడు సత్యదేవ్ హీరోగా ఆనంది హీరోయిన్గా అమెజాన్ ప్రైమ్ అనౌన్స్ చేసిన అరేబియన్ కడలి లైన్ కూడా దాదాపు ఇలాగే సాగబోతుందని నిన్న క్లారిటీ ఇచ్చేశారు.
Abraham Ozler : ఓటిటిలోకి వచ్చేసిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఇక మరొక పక్క వరుణ్ తేజ్ హీరోగా మట్కా అనే సినిమా తెరకెక్కుతోంది. ఒకప్పటి నిర్మాత, మట్కా కింగ్ గా పేరు తెచ్చుకున్న రతన్ ఖాద్రి అనే నిర్మాత జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు మీడియాకి లీకులు అందాయి. ఆయన నిజానికి ఒక పత్తి వ్యాపారి, ముంబైలో న్యూయార్క్ కాటన్ ఎక్స్చేంజ్ సంబంధించిన ఓపెనింగ్ క్లోజింగ్ ప్రైస్ మీద మట్కా బెట్టింగ్ మొదలుపెట్టాడు. ఇప్పుడు మట్కా కింగ్ పేరుతో తమన్నా ప్రియుడు విజయ్ వర్మ హీరోగా మరొక వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నట్లు అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది. అలా తండేల్, మట్కా సినిమాలకు అమెజాన్ ప్రైమ్ దించబోతున్న రెండు వెబ్ సిరీస్ లోకి లైన్ ఒకటే కావడంతో కాస్త తెలుగు నిర్మాతలకి టెన్షన్ పెట్టించే విషయం అనే చెప్పాలి.