ఆ డైరెక్టర్ జీవితంలో చిచ్చుపెట్టిన అమలాపాల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులను తట్టుకుని, నటిగా ముందుకు సాగే ప్రయత్నం గట్టిగా చేస్తోంది ప్రముఖ కథానాయిక అమలాపాల్. అందుకే గతంలో మాదిరి మరోసారి విలక్షణమైన పాత్రలను ఎంపిక చేసుకుంటోంది. కేవలం సినిమాలకే పరిమితమై పోకుండా ఆంథాలజీలు, వెబ్ సీరిస్ లకూ సై అంటోంది. ఇప్పటికే తెలుగులో ‘కుడిఎడమైతే’ వెబ్ సీరిస్ చేసిన అమలాపాల్ తాజాగా హిందీలోనూ ఓ వెబ్ సీరిస్ చేసింది. అదే ‘రంజిష్ హీ సహీ’. జనవరి 13 నుండి వూట్ ఓటీటీలో ప్రసారం కాబోతున్న ఈ వెబ్ సీరిస్ ట్రైలర్ సోషల్ మీడియాలో యూత్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Read Also : ఇద్దరి మంచికే… సామ్ తో డివోర్స్ పై నాగ చైతన్య ఫస్ట్ రియాక్షన్
Also Read
- Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
- RaviTeja - VivekAthreya : రవితేజ 'తులాభారం'లో తూగబోయే నటీనటులు వీరేనట
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
- EPIC : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న 'ఎపిక్'.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే?
పుష్పదీప్ భరద్వాజ్ దర్శకత్వంలో మహేశ్ భట్ ఈ వెబ్ సీరిస్ నిర్మించాడు. ఇందులో కథానాయకుడు శంకర్ పాత్రను ’83’ మూవీలో సునీల్ గవాస్కర్ గా నటించిన తాహిర్ రాజ్ బసీన్ పోషిస్తున్నాడు. విశేషం ఏమంటే… ఈ వెబ్ సీరిస్ స్టోరీ యాభై శాతం మహేశ్ భట్ జీవితమే అంటున్నాడు తాహిర్. మిగిలిన సగం ఫిక్షన్ అని చెబుతున్నాడు. ఇందులో అతను దర్శకనిర్మాతగా నటించాడు. భార్య పట్ల విధేయుడిగా ఉండే ఈ దర్శకుడి జీవితంలోకి ఓ పాపులర్ నటి, సింగర్ అడుగుపెట్టడంతో ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ వెబ్ సీరిస్ సారాంశం. దర్శకుడి వైవాహిక జీవితంలో చిచ్చపెట్టే స్టార్ గా అమలాపాల్ నటించింది. పాత్రోచితంగా మద్యం తీసుకోవడం, సిగరెట్ తాగడం, లిప్ లాక్ చేయడం వంటి సన్నివేశాలు ట్రైలర్ లో ఉండటంతో అది కాస్త వైరల్ అయ్యింది. అమలాపాల్ ప్రస్తుత పరిస్థితికి ఆమె పాత్రను అన్వయించుకుని కూడా కొందరు చూస్తున్నారు. అయితే… కేవలం గ్లామర్ షోకు పరిమితం కాకుండా అమలాపాల్ ఆ పాత్ర ద్వారా చక్కని నటన కూడా ప్రదర్శించిందని తెలుస్తోంది. అందులో ఆమె ఏమేరకు సక్సెస్ అయ్యిందనేది ‘రంజిష్ హీ సహీ’ చూస్తే కానీ తెలియదు.
తాజావార్తలు
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
-
Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!