Allu Arha: తిరుపతిలో అల్లు కోడలు.. కెమెరా కంటికి కనిపించకుండా అల్లరి చేసిన అర్హ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arha: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి నేడు తిరుమలలో సందడి చేసింది. ఆమె తల్లి కవితతో పాటు కూతురు అర్హతో కలిసి స్వామివారి దర్శనం చేసుకుంది. ఈరోజు ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్నేహ.. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ అనంతరం వేద పండితులు.. స్నేహా రెడ్డికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక తిరుమలలో అల్లు అర్హ అల్లరి అంతా ఇంతా కాదు. పుట్టిన దగ్గరనుంచి అర్హ ఒక చిన్నపాటి సెలబ్రిటీ గా మారిపోయింది. పెరిగేకొద్దీ.. అర్హ ఫోటోలను, వీడియోలను స్నేహ, బన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అల్లు అర్జున్ కొడుకు అయాన్ కంటే అర్హ గురించే ఎక్కువ తెలుసుకోవాలనుకుంటారు అభిమానులు. ఇక తండ్రితో కలిసి అర్హ చేసే అల్లరి అంతాఇంత కాదు.
తాజాగా తిరుమలలో కూడా అర్హ అల్లరి చేస్తూ కనిపించింది. తల్లి వెనుక దాక్కొని కెమెరాల కంటికి కనిపించను అని మారాం చేసింది. ఫొటోగ్రాఫర్లు అర్హ.. అర్హ అని పిలుస్తున్నా నేను రాను అంటూ స్నేహ వెనక్కి వెళ్లి దాక్కొంది. అంతేకాకుండా తల్లి చున్నీని ముఖానికి అడ్డుపెట్టుకొని కనిపించింది. ఇక ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వావ్ .. అర్హ.. భలే క్యూట్ గా ఉన్నావే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే.. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయనున్నాడు.
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!