Pawan Kalyan: శిరీష్ పెళ్ళికి పవన్’కు ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా కుటుంబంలో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడు, యువ హీరో అల్లు శిరీష్ వివాహ వేడుకకు సర్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే శిరీష్ తన వివాహ ఆహ్వాన పత్రికను మెగా కుటుంబ సభ్యులకు స్వయంగా అందజేస్తూ సందడి చేస్తున్నారు. తాజాగా అల్లు శిరీష్ తన తండ్రి అల్లు అరవింద్, తల్లి నిర్మలతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. అక్కడ పవన్ కళ్యాణ్, ఆయన ధర్మపత్ని అన్నాలెజ్నేవాను కలిసి తన పెళ్లికి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానించారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న శిరీష్, తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. “నాన్న, అమ్మతో కలిసి పవన్ కళ్యాణ్ గారు, లెజ్నేవా గారిని కలిసి నా పెళ్లికి ఆహ్వానించాను. వారు నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు” అంటూ ట్వీట్ చేశారు.
Also Read:Kiran Abbavaram: భారీగా రెమ్యునరేషన్ పెంచిన కిరణ్ అబ్బవరం?
Also Read
- Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. 'శివ నువ్వు తోపు సామీ'.. స్టేజ్ పైనే డైరెక్టర్‌ను హత్తుకున్న మాస్ మహారాజా!
- Shiva Nirvana: రవన్నతో ఆ సీన్ తీస్తున్నప్పుడు భయపడ్డా.. ‘ఇరుముడి’ అసలు కథ బయటపెట్టిన డైరెక్టర్!
- Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
- Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా, మెగా బ్రదర్ నాగబాబు, ఆయన భార్య పద్మజని కూడా శిరీష్ ప్రత్యేకంగా కలిసి పెళ్లి వేడుకలకు ఆహ్వానించారు. మెగా మరియు అల్లు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ కలయిక మరోసారి చాటిచెప్పింది. రాజకీయ, సినిమా రంగాల్లో బిజీగా ఉన్నప్పటికీ, అల్లు శిరీష్‌ను పవన్ కళ్యాణ్ ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించి అభినందనలు తెలిపారు. అల్లు అరవింద్ దంపతులు స్వయంగా వెళ్లి మెగా సోదరులను కలవడం గమనార్హం. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ అవుతుండటంతో మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా కాలంగా అల్లు శిరీష్ పెళ్లి గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ఇప్పుడు స్వయంగా ఆయనే పెద్దలను ఆహ్వానిస్తుండటంతో, వివాహ ముహూర్తం దగ్గరపడిందని స్పష్టమవుతోంది. త్వరలోనే ఈ వేడుకకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
Dad, amma and me had visited @PawanKalyan garu & Smt Lezhneva and invited them for our wedding. Also invited @NagaBabuOffl and Smt Padmaja for all our wedding festivities. All of them were very happy for me! ❤️✨ pic.twitter.com/ZNIFkkWEPL
— Allu Sirish (@AlluSirish) February 23, 2026
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్‌లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!