Allu Shirish : అల్లు శిరీష్ రీసెంట్ గానే తాను ప్రేమించిన నయనికతో ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే కదా. వీరిద్దరూ కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నారు. కానీ ఆ విషయం బయటకు తెలియనివ్వలేదు. అయితే వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఎలా మొదలైందో తెలుసుకునేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని శిరీష్ స్వయంగా తెలిపాడు. నేడు వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి రోజు. ఈ సందర్భంగా వారికి విషెస్ తెలిపాడు శిరీష్. 2023లో వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి టైమ్ లో నితిన్-షాలినీ కలిసి ఓ పార్టీ ఇచ్చారు.
Read Also : Singer Chinmayi : లైంగిక వేధింపులను ప్రోత్సహించడమే.. జానీ మాస్టర్ పై చిన్మయి సంచలనం
నేను ఎంగేజ్ మెంట్ చేసుకున్న నయనిక షాలినీ ఫ్రెండ్. ఆ పార్టీకి నేను కూడా వెళ్లాను. అక్కడే నయనికను ఫస్ట్ టైమ్ కలిశాను. ఆ తర్వాత మేమిద్దరం ఫ్రెండ్స్ అయ్యాం. మెల్లిగా ప్రేమ మొదలైంది. చివరకు ఎంగేజ్ మెంట్ చేసుకున్నాం. నన్ను నయనిక వాళ్ల ఫ్రెండ్స్ గ్యాంగ్ లో చేర్చుకున్నందుకు చాలా థాంక్స్ అంటూ రాసుకొచ్చాడు శిరీష్. ఈ విధంగా తన ప్రేమ వ్యవహారాన్ని మొత్తం బయట పెట్టేశాడు. ఇక శిరీష్ పెళ్లి త్వరలోనే జరగబోతోంది. శిరీష్ ఎంగేజ్ మెంట్ తో అల్లు వారింట సందడి నెలకొంది.
Read Also : Allu Arjun : అల్లు అర్జున్ కు దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు.. వర్సటైల్ యాక్టర్
