ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ ఇప్పుడు మూవీ స్టిల్స్ తో కంటే జనరల్ స్టిల్స్ తోనే సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. జిమ్ లో సిక్స్ ప్యాక్ చేస్తున్నప్పటి ఫోటోలనో, తనకు ఇష్టమైన సీన్స్ నూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా అల్లు శిరీష్ ఓ ఫోటో షూట్ చేశాడు. ఓ ఎత్తైన భవంతి పైన సూపర్ ఫాస్ట్ గా నడుస్తూ…. ఫోటోలకు ఫోజులిచ్చాడు. అలాంటి రెండు ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ, ‘సూపర్ హీరోలంతా క్యాప్ ను ధరించరు… కొందరు ట్రెంచ్ కోట్ వేస్తారు’ అని కామెంట్ పెట్టాడు. ఈ ఫోటోలోనూ అల్లు శిరీష్ ట్రెంచ్ కోట్ ధరించి, స్టైలిష్ లుక్ ఇచ్చాడు. అయితే పైన చెప్పినట్టుగా నెత్తి మీద టోపీ మాత్రం లేదు. సో… అతని మాటలను బట్టి ఇది సూపర్ హీరో లుక్ అని అభిమానులు అర్థం చేసుకోవాలి.
Read Also: ఆశిష్ మరో బన్నీ అవుతాడా!?
నటుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత శిరీష్ తన ఫిజిక్ కు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నాడు. అందులో భాగంగానే సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. ఇక సినిమాల విషయానికి వస్తే… అల్లు శిరీష్ తాజా చిత్రం ‘ప్రేమ కాదంట’ విడుదల కావాల్సి ఉంది. ఈ న్యూ ఏజ్ లవ్ స్టోరీలో అనూ ఇమాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. రాకేశ్ శశి దర్శకత్వంలో ఎమ్ విజయ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అనూప్ రూబెన్స్, అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్న ఈ మూవీ లేటెస్ట్ అప్ డేట్స్ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

