మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ డ్రామా “గని”లో తన నటనతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రంలో వరుణ్‌కు జోడీగా బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ నటిస్తున్నారు. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నదియా, నరేష్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సిద్ధు ముద్దా, అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీత సంచలనం థమన్ మ్యూజిక్ అందించారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 8న థియేటర్లలోకి రానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో సినిమా ప్రమోషన్లను వేగవంతం చేస్తున్నారు మేకర్స్. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పై క్రేజీ అప్డేట్ ను షేర్ చేశారు.
Read Also : Aadhi and Nikki Galrani : హీరోయిన్ ఎమోషనల్… ఎంగేజ్మెంట్ వీడియో వైరల్
“గని” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 2న వైజాగ్‌లో గ్రాండ్‌గా జరుగుతుందని తెలియజేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అదే పోస్టర్ లో ఈ కార్యక్రమానికి విచ్చేయనున్న ముఖ్య అతిథి ఎవరో కూడా ప్రకటించారు. “గని” ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్ ” మూవీని చూసి ఎంజాయ్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ “గని” చిత్రం విడుదల గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు అల్లు అర్జున్ “పుష్ప”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని, “పుష్ప 2” షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు.