Site icon NTV Telugu

Allu Arjun : క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ కు బన్నీ బర్త్ డే విషెస్

Allu Arjun

Allu Arjun

Allu Arjun : యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ గేర్ లో దూసుకుపోతున్నాడు. ఆయన చేసిన సోలో సింగిల్ కచ్చి సెరా పాటతో దుమ్ము లేపాడు. ఈ సాంగ్ ఇండియాలో అత్యధికంగా సెర్చ్ చేయబడిన పాటగా రికార్డు సృష్టించింది. ఈ ఒక్క పాటతో ఏకంగా ఏడు సినిమాలకు సంగీతం అందించే అవకాశం కొట్టేశాడు మనోడు. ఏకంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో వస్తున్న మూవీకి కూడా మ్యూజిక్ అందించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అయితే నేడు ఆయన బర్త్ డే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ స్పెషల్ ట్వీట్ చేశాడు. నా బ్రదర్ సాయి అభ్యంకర్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ అంటూ ట్వీట్ చేశాడు.
Read Also : Rahul Ravindran : తాళి వేసుకోవడం వివక్ష లాంటిదే.. రాహుల్ రవీంద్రన్ కామెంట్స్

మంచి సక్సెస్ అందాలని కోరాడు. ఇందుకు సంబంధించిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అటు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ కూడా సాయి అభ్యంకర్ కు బర్త్ డే విషెస్ తెలిపింది. ప్రస్తుతం సాయి ఏడు సినిమాలకు సంగీతం అందిస్తున్నాడు. మొన్న వచ్చిన డ్యూడ్ సినిమాకు ఆయనే మ్యూజిక్ అందించాడు. అటు సూర్య హీరోగా వస్తున్న కరుప్పు సినిమాకు, కార్తీ మూవీకి ఆయనే మ్యూజిక్ ఇస్తున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రాబోతున్న సినిమా షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది.

Read Also : Madhuri : వాడు పశువుతో సమానం.. భరణితో ట్రోల్స్ పై స్పందించిన మాధురి..

Exit mobile version