Peddi : “పెద్ది”పై అల్లు అర్జున్ జెన్యూన్ రివ్యూ… ప్రశంసల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddi : వివాదాల నడుమ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న ‘పెద్ది’పై ప్రశంసలు కూడా పెద్ద ఎత్తున విన్పిస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో అల్లు అర్జున్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి స్పందన వస్తున్న వేళ, స్వయంగా సినిమా చూసిన బన్నీ తన అభిప్రాయాన్ని పంచుకోవడం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ మూవీపై అల్లు అర్జున్ ఇచ్చిన రివ్యూ ఏంటంటే…
‘పెద్ది’ చూసిన తర్వాత రామ్ చరణ్ నటన గురించి అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. బన్నీ తన పోస్ట్ లో చరణ్ పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉందని చెప్పారు, అలాగే చెర్రీ పెద్ది పాత్రలో ఇంటెన్స్ గా, సహజంగా, అద్భుతమైన ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్ తో ఆకట్టుకున్నాడని, డ్యాన్స్ లో కనిపించిన గ్రేస్ అన్నీ కలిసి ఒక పూర్తి స్థాయి నటుడిగా చరణ్ ను మరోసారి నిరూపించాయని పేర్కొన్నారు. ప్రతి అంశంలోనూ చరణ్ అద్భుతంగా రాణించాడని, ప్రస్తుతం అతడికి వస్తున్న ప్రశంసల్లో ప్రతి ఒక్కటి అతడు సంపాదించుకున్నవేనని చెప్పారు. తన సోదరుడి విజయాన్ని చూసి గర్వంగా ఉందని కూడా అల్లు అర్జున్ పేర్కొన్నారు.
Also Read
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
Watched #Peddi last night. Mind-blowing performance by my dear @AlwaysRamCharan.
A Gritty, raw performance, extraordinary body transformation, and graceful dance moves. He absolutely aced it in every aspect. Genuinely very proud of my brother. Truly deserves every bit of the…— Allu Arjun (@alluarjun) June 9, 2026
అక్కడితో ఆగకుండా సినిమాలో కీలక పాత్ర పోషించిన జగపతి బాబు గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన నటన బలంగా నిలిచిందని చెప్పారు. అలాగే జాన్వీ కపూర్ తో పాటు మిగతా నటీనటులందరికీ అభినందనలు తెలియజేశారు. తెరపై కనిపించే నటీనటులే కాదు, సినిమా కోసం కష్టపడిన టెక్నీషియన్స్, నిర్మాతలు కూడా ప్రశంసలకు అర్హులని చెప్పారు.
అయితే అల్లు అర్జున్ పోస్ట్ లో మరో ముఖ్యమైన అంశం దర్శకుడు బుచ్చిబాబు సానాపై చేసిన ప్రశంసలు. ప్రతి పాత్రను ఎలివేట్ చేస్తూనే రామ్ చరణ్ పాత్రను మరింత ఎత్తుకు తీసుకెళ్లినందుకు దర్శకుడికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఒక హీరోని మాత్రమే కాకుండా మొత్తం కథలోని పాత్రలన్నింటినీ బలంగా నిలబెట్టడం దర్శకుడి విజయమని ఆయన సందేశం ద్వారా స్పష్టమైంది. సాధారణంగా అభిమానుల మధ్య పోలికలు, ఫ్యాన్ వార్స్ ఎక్కువగా కన్పిస్తాయి. కానీ ఒక స్టార్ హీరో మరో స్టార్ హీరో పనితీరును ఇంత ఓపెన్ గా ప్రశంసించడం అరుదుగా జరుగుతుంది. అందుకే అల్లు అర్జున్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
- Tags
- Allu Arjun
- cinema
- Peddi
తాజావార్తలు
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!