టాలీవుడ్ లో భారీ అంచనాలున్న చిత్రాల్లో ‘పుష్ప’ ఒకటి. ఈ శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా… ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తాజాగా “పుష్ప” గురించి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. దానికి అల్లు అర్జున్ కూడా ‘తగ్గేదే లే’ అంటూ రిప్లై ఇవ్వడం సినీ ప్రియుల్లో ఆసక్తికరంగా మారింది.
Read Also : “పుష్ప” ఫస్ట్ రివ్యూ అవుట్… ఎలా ఉందంటే ?
“పుష్ప కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ట్రైలర్, పాటలు, విజువల్స్, పెర్ఫార్మెన్స్… అంతా మాస్… నెక్స్ట్ లెవెల్ తెలుగు సినిమా అల్లు అర్జున్ అన్న… రష్మిక మందన్న, సుక్కు సార్‌కి ప్రేమను పంపుతూ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని విజయ్ దేవరకొండ ట్వీట్ చేయగా… దానికి అల్లు అర్జున్ స్పందిస్తూ “ప్రేమకు ధన్యవాదాలు మై బ్రదర్… మేము మీ హృదయాలను గెలుచుకుంటామని ఆశిస్తున్నాము. రియాక్షన్ కోసం వేచి చూస్తున్నాము… శుక్రవారం … తగ్గేదే లే” అంటూ రిప్లై ఇచ్చారు.
Pushpaaa in 2 daysss 🔥🔥
— Vijay Deverakonda (@TheDeverakonda) December 15, 2021
Mad excited for this one!
FDFS 💯
Trailer, songs, visuals, performances – antha mass 😎
Next level Telugu cinema 💥
Sending biggest love and wishing massive success to @alluarjun anna, @iamRashmika and @aryasukku sir 🤍 pic.twitter.com/wIOHmSso1B
రెండు రోజుల క్రితం విడుదలైన “పుష్ప : ది రైజ్” ట్రైలర్ గురించి విజయ్ ఎలాంటి ట్వీట్ చేయకపోవడంతో అల్లు అర్జున్ అభిమానులు కలత చెందారు. విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం” ట్రైలర్ లాంచ్‌కు అల్లు అర్జున్ హాజరు అయినప్పటికీ ‘పుష్ప’ ట్రైలర్ గురించి విజయ్ దేవరకొండ చిన్న మెసేజ్ కూడా చేయకపోవడం, పైగా “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ గురించి స్పెషల్ గా ట్వీట్ చేయడంతో బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహానికి విజయ్ దేవరకొండ గురి కావాల్సి వచ్చింది. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ చూస్తే బన్నీ అభిమానులతో పాటు విజయ్ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.