Site icon NTV Telugu

Allu Arjun: బాలయ్య ముందు నంద్యాల విషయంపై బన్నీ కామెంట్స్

Ravi Reddy Silpa Allu Arjun

Ravi Reddy Silpa Allu Arjun

గత కొంతకాలంగా అల్లు అర్జున్ నంద్యాల వివాదం హాట్ టాపిక్ అవుతూనే ఉంది. 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి తన స్నేహితుడు అంటూ ఆయనకు మద్దతు పలికేందుకు అల్లు అర్జున్ నంద్యాల వెళ్లారు. ఆ సమయంలో ఆయన మీద అనుమతి లేకుండా ర్యాలీ చేశారంటూ కేసులు కూడా నమోదు అయ్యాయి. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఈ అంశం మీద అల్లు అర్జున్ స్పందించినట్టు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్‌’ సీజన్ 4’ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ అక్టోబర్‌ 25న తొలి ఎపిసోడ్ ప్లే అయింది.

Ram Pothineni: మహేష్ బాబుతో రామ్ పోతినేని.. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే?

అయితే అన్ స్టాపబుల్ 4లో ఒక ఎపిసోడ్ కు అల్లు అర్జున్ గెస్ట్ గా రానున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 సీక్వెల్ రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో పుష్ప టీమ్ కూడా షోకు వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ అయిందని, త్వరలోనే ప్రోమో రిలీజ్ అవ్వనుందని తెలుస్తోంది. ఇదిలాఉండ‌గా ఈ షోలో భాగంగా బాలయ్య అల్లు అర్జున్… నంద్యాల టూర్ మీద, వైసీపీ అభ్యర్థికి ప్రచారం చెయ్యడం మీద క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. మరోపక్క ఫస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అతిధిగా విచ్చేసారు. రెండో ఎపిసోడ్ లక్కీ భాస్కర్ టీంతో చేశారు. దాని ప్రోమో ఇప్పటికే రిలీజ్ అయింది.

Exit mobile version