ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరిగిపోతోంది. ‘పుష్ప’ చిత్రం తరువాత దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ కు భారీ సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. ఈ సినిమాలో బన్నీ రస్టిక్ లుక్, అలాగే మ్యానరిజమ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు ‘పుష్ప’. ఆయన ఫైర్ సెలెబ్రెటీలకు కూడా అంటుకుంది. సెలెబ్రిటీలు సైతం ‘పుష్ప’రాజ్ మేనియాలో తేలియాడడంతో వారి అభిమానులు కూడా ఈ హీరోను ఇష్ట పడడం మొదలు పెట్టారు. ఇప్పటికే తన యాక్టింగ్ అండ్ డ్యాన్సింగ్ స్కిల్స్ తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న బన్నీ ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో 15 మిలియన్ల మంది ఫాలోవర్లను దాటేసి… సౌత్ లో ఈ రేర్ ఫీట్ సాధించిన హీరోగా రికార్డు సృష్టించాడు. తాజాగా అల్లు అర్జున్ తన రికార్డును తానే బ్రేక్ చేసేశాడు.
Read Also : Samantha : అర్థరాత్రి ఎయిర్ పోర్ట్ లో డ్యాన్స్… వీడియో వైరల్
తాజాగా అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ లో 17 మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు. దాదాపు నెల రోజుల వ్యవధిలోనే బన్నీకి ఇన్‌స్టాలో మరో 2 మిలియన్ల మంది ఫాలోవర్లు పెరగడం విశేషం. తాజాగా అల్లు అర్జున్ ఈ మైలురాయిని దాటడం పట్ల ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇన్‌స్టాగ్రామ్ లో ఇంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక సౌత్ హీరో అల్లు అర్జునే ! ‘పుష్ప’ ఫైర్ బన్నీ ఫాలోయింగ్ ను అమాంతంగా భారీ సంఖ్యలో పెంచేసింది.