NTV Telugu Site icon

Allu Arjun: బన్నీ డే… ఢిల్లీలో పుష్పగాడి రూల్!

Allu Arjun

Allu Arjun

2023 అక్టోబర్ 17… ఈ డేట్ చానా ఏండ్లు గుర్తుండి పోతది అల్లు అర్జున్ అభిమానులకు. ఈ రోజు 69 ఏళ్ల తెలుగు సినీ చరిత్రను తిరగరాసి… బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకోనున్నాడు బన్నీ. పుష్ప సినిమాతో ఎన్నో రికార్డ్స్ సొంతం చేసుకున్న బన్నీ… స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారాడు. అలాగే పాన్ ఇండియా స్టార్‌డమ్ అందుకున్నాడు. పుష్పరాజ్‌గా బన్నీ మాసివ్ పర్ఫార్మెన్స్‌కు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్ బన్నీకి బ్రహ్మరథం పట్టారు. తగ్గేదేలే.. అంటూ బన్నీ మ్యానరిజానికి యావత్ ప్రపంచం ఫిదా అయిపోయింది. ఇక 69వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడిగా అవార్డ్ సొంతం చేసుకోని, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక సంచలనం సృష్టించాడు.

Read Also: Pushpa 2: మెగాభిమానిగా పుష్పరాజ్… థియేటర్లు షేక్ అవుతాయి

జాతీయ అవార్డులు పెట్టినప్పటినుంచీ ఒక తెలుగు నటుడికి అవార్డ్ రావటం ఇదే మొదటిసారి. ఈ అవార్డు కార్యక్రమం ఢిల్లీలో జరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవటం కోసం అల్లు అర్జున్ తన సతీమణి స్నేహ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లాడు. ప్రస్తుతం బన్నీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఒక్క ఎయిర్‌పోర్ట్, ఢిల్లీ ఫోటోలే కాదు… గంగోత్రి నుంచి పుష్ప సినిమా వరకు బన్నీ జర్నీకి సంబంధించిన వీడియోలతో రచ్చ చేస్తున్నారు అల్లు అభిమానులు. ట్విట్టర్‌లో #AlluArjun..  #Pushpa2TheRule.. #NationalFilmAwards ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. బన్నీ బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకొని హైదరాబాద్‌కు రావడమే లేట్… గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పడానికి రెడీ అవుతున్నారు. మొత్తంగా అక్టోబర్ 17 బన్నీ డేగా మారిపోయింది.