Allu Arjun met Megastar Chiranjeevi: పుష్ప సినిమాలో నటనకు గాను ఉత్తమ జాతీయ నటుడు అవార్డు ప్రకటించినప్పటి నుంచి అల్లు అర్జున్ మీద ప్రశంసల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. దాదాపుగా ఉత్తమ జాతీయ నటుడు అవార్డు అనౌన్స్ చేసినప్పటి నుంచి అల్లు అర్జున్ కి అసలు ఏమాత్రం సమయం దొరక్కపోవడంతో బిజీ బిజీగా గడుపుతున్నారు దాదాపుగా. చాలామంది సినీ ప్రముఖులు, సినీ జర్నలిస్టులు అల్లు అర్జున్ నివాసానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బ్రహ్మానందం చిన్న కుమారుడు వివాహానికి అల్లు అర్జున్ వెళ్లని నేపథ్యంలో నిన్న బ్రహ్మానందం నివాసానికి వెళ్లి గంటన్నర సేపు బ్రహ్మానందం కుటుంబంతో సమయం గడిపారు. ఇక తాజాగా తన మేనత్త నివాసానికి వెళ్లిన బన్నీ అక్కడ తన మామ సినీ రంగంలో తన గురువుగా చెప్పుకునే చిరంజీవిని కలిశారు.
King of Kotha: మెంటల్ ఎక్కిస్తున్న ‘కింగ్ ఆఫ్ కొత్త’ కలెక్షన్స్…కేజీఎఫ్ ను క్రాస్ చేసి!
ఈ సందర్భంగా అల్లు అర్జున్ కి మెగాస్టార్ చిరంజీవి దంపతులు శుభాకాంక్షలు తెలియజేశారు. నిజానికి చిరంజీవి కొన్నాళ్ల క్రితమే మోకాళ్ళకి సంబంధించిన సర్జరీ చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో కొన్నాళ్లపాటు ఉన్న ఆయన ఈ మధ్యనే హైదరాబాద్ తిరిగి వచ్చారు. పూర్తి స్థాయిలో రెస్ట్ మోడ్ లో ఉన్న చిరంజీవి నివాసానికి వెళ్లి అల్లు అర్జున్ ఆయన ఆశీర్వాదం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే మోకాళ్ళ సర్జరీ అయిన తరువాత చిరంజీవికి సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదు, ఇప్పుడు అల్లు అర్జున్ తో కలిసి దిగిన ఫోటోలు బయటకు రావడం, అందులో ఆయన మామూలుగానే నిలబడి ఉండడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక ఈరోజు సినీ మీడియా మొత్తానికి అల్లు అర్జున్ ఒక భారీ పార్టీ కూడా అరేంజ్ చేశారు. రేపు ఉదయం ఈ అవార్డు అనౌన్స్ చేసిన అంశానికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.