ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలసి విహారయాత్రలో ఉన్నాడు. అందులో భాగంగా భార్య స్నేహా రెడ్డి పిల్లలు, అర్హ, అయాన్ తో ఆఫ్రికన్ అడవుల్లో విహరిస్తున్నారు. ఇటీవల అల్లు స్నేహారెడ్డి తన సోషల్ మీడియాలో టాంజానియాలోని సెరెంగేటి నేషనల్ పార్క్‌ను విజిట్ చేసిన విషయాన్ని తెలియచేస్తూ ఓ పిక్ పెట్టింది. నిజానికి అల్లు అర్జున్ ఫ్యామితో విహరిస్తున్నప్పటికీ తన విహారయాత్రతో పాటు త్వరలో ఆరంభం కాబోయే ‘పుష్ప2’ సినిమా లొకేషన్ల వేట కూడా చేస్తున్నట్లు సమాచారం. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో తీయవలసిన ఈ సినిమా షూటింగ్ కోసం అనువైన ప్రదేశాలను వెతుకుతూ తనకు నచ్చితే దానిని దర్శకుడు సుకుమార్‌తో షేర్ చేసుకుని షూట్ ప్లాన్ చేయటమే ప్రదానోద్దేశమట. అంటే స్వకార్యంతో పాటు స్వామికార్యంకూడా నెరవేర్చే పనిలో ఉన్నాడన్నమాట. ఇక ‘పుష్ప’ తొలి భాగం సూపర్ సక్సెస్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన బన్నీ ఈ సీక్వెల్ తో మరింత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. మరి అల్లువారబ్బాయి ప్లాన్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందన్నది చూడాలి. ఇక మంగళవారం వరల్డ్ ఎన్విరాన్ మెంటల్ డే సందర్భంగా గ్రీనర్ ప్లానెట్ దిశగా అందరూ కలసి పని చేయాలనే పిలుపు ఇచ్చాడు ఐకాన్ స్టార్.
Allu Arjun : టాంజేనియా అడవుల్లో అల్లు అర్జున్

Allu Family