Allu Arjun: బింబిసార చిత్రబృందంపై ప్రశంసల వర్షం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun heaps praises on Bimbisara Team: ఈనెల 5వ తేదీన విడుదలైన ‘బింబిసార’ సినిమా విజయవంతంగా దూసుకెళ్తోంది. కళ్యాణ్ రామ్, కొత్త దర్శకుడు వశిష్ట్ కాంబోలో వచ్చిన ఈ చిత్రం.. మంచి వసూళ్లు కొల్లగొడుతూ, టాలీవుడ్ బాక్సాఫీస్‌కి ఊపిరి పోసింది. ఈ నేపథ్యంలోనే బింబిసార చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సినీ అభిమానుల దగ్గర నుంచి ప్రముఖులు దాకా.. ప్రతిఒక్కరూ ఈ చిత్రాన్ని, కళ్యాణ్ రామ్, దర్శకుడు వశిష్ట్‌ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా ఈ బాబితాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా చేరిపోయాడు. రీసెంట్‌గా ఈ సినిమా చూసిన బన్నీ, సినిమా హిట్ అయినందుకు యూనిట్‌ని అభినందనలు తెలిపాడు. కొత్త ట్యాలెంట్‌ని ప్రోత్సాహిస్తోన్న కళ్యాణ్‌ని తానెంతో గౌరవిస్తానని పేర్కొన్నాడు.
‘‘బింబిసార చిత్రబృందానికి శుభాభినందనలు. ఇదొక ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన ఫ్యాంటసీ సినిమా. కళ్యాణ్ రామ్ నటన ప్రభావితం చేసేలా ఉంది. ఎల్లప్పుడూ కొత్త తరహా కథల్ని అటెంప్ట్ చేయడంతో పాటు కొత్త ట్యాలెంట్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తోన్న కళ్యాణ్ రామ్ అంటే నాకెంతో గౌరవం. తొలి ప్రయత్నంలో ఇంత గొప్ప చిత్రాన్ని హ్యాండిల్ చేసిన దర్శకుడు వశిష్ట్ పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే. ఈ సినిమాకి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు నా హృదయపూర్వక శభాభినందనలు. బింబిసార.. అన్ని వయసుల వారు చూసి, ఎంజాయ్ చేయగలిగే సినిమా’’ అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. దీంతో, నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక స్టార్ హీరో తమ అభిమాన హీరో చిత్రానికి ఇలా మద్దతు తెలపడంతో, ఆ ట్వీట్లను షేర్ చేస్తూ, నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు.
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
కాగా.. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందిన ‘బింబిసార’ సినిమాలో కళ్యాణ్ రామ్ త్రిగర్తల సామ్రాజ్యాధినేతగా నటించారు. రాజ్యాధికార కాంక్షతో ఎంతోమందిని బలితీసుకున్న రాజు.. టైమ్ ట్రావెల్ చేసి, ప్రస్తుత లోకంలో వచ్చి, తాను చేసిన తప్పుల్ని తెలుసుకొని, వాటిని సరిదిద్దుకునే అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో సంయుక్తా మీనన్, కేథరీన్ తెరిసాలు హీరోయిన్లుగా నటించారు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!