ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మొదటి పాన్ ఇండియా మూవీ “పుష్ప: ది రైజ్” చిత్రం విడుదల తర్వాత షూటింగ్ లకు కాస్త విరామం తీసుకున్నాడు. సినిమా సక్సెస్ టాక్ తో దూసుకెళ్తోంది. సినిమా విడుదల చివరి నిమిషం వరకూ ఆదరాబాదరాగా ఉన్న చిత్రబృందం ‘పుష్ప’కు మంచి స్పందనే రావడంతో రిలాక్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ వెకేషన్ ను ప్లాన్ చేశాడు ‘పుష్ప’రాజ్. కుటుంబ సభ్యులతో కలిసి ఈ సక్సెస్ ను ఆస్వాదించడానికి బన్నీ ఈ ట్రిప్ ప్లాన్ చేశాడు. ఇప్పుడు కుటుంబ విహారయాత్రతో పాటు 2022 నూతన సంవత్సరాన్ని జరుపుకోవడానికి గోవా చేరుకున్నారు. ప్రస్తుతం సెలబ్రిటీలు 2022కి స్వాగతం పలికేందుకు తమకు ఇష్టమైన ప్రదేశాలకు వెళ్తున్నారు.
సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి అద్భుతమైన సమీక్షలను అందుకుంటుంది. ‘పుష్ప: ది రైజ్’ పార్ట్ 1 విజయవంతం అయిన తర్వాత ‘పుష్ప: ది రూల్’ అనే రెండవ భాగాన్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా ‘పుష్ప’రాజ్ చెన్నై, హైదరాబాద్ లో సక్సెస్ పార్టీని ఇచ్చాడు. సినిమా ప్రమోషన్లతో అలసిపోయిన బన్నీ చివరకు తన భార్య స్నేహ, పిల్లలు అర్హ, అయాన్‌లతో గడపడానికి విరామం తీసుకున్నాడు. ఇదిలా ఉంటే సమంత కూడా తన బెస్ట్ ఫ్రెండ్ శిల్పా రెడ్డితో కలసి గోవాలో ఉంది.