Allu Arjun : పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేయడంలో ప్రభాస్, అల్లు అర్జున్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. ఈ ఇద్దరూ భారీ ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నారు. పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ప్రభాస్ ఈ నడుమ చేస్తున్న సినిమాలను గమనిస్తుంటే.. కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలేతో ఏకంగా మూడు సినిమాలు చేయడానికి ఓకే చెప్పేశాడు. సాధారణంగా ప్రభాస్ ఒకే నిర్మాణ సంస్థకు ఇన్ని సినిమాలకు కమిట్ అవ్వడు. టాలీవుడ్ లో ఎవరికీ దక్కని ఛాన్స్ హోంబలేకు దక్కింది. అయితే అల్లు అర్జున్ కూడా ఇదే దారిలో నడుస్తున్నాడంట.
Read Also : Movie Ticket Rates : కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం.. టాలీవుడ్ కొంప ముంచుతుందా..?
అల్లు అర్జున్-అట్లీ కాంబోలో భారీ ప్రాజెక్ట్ వస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని కోలీవుడ్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్ తో దీన్ని తీస్తున్నారు. అల్లు అర్జున్ మీద ఇంతటి భారీ బడ్జెట్ ను టాలీవుడ్ సంస్థలు ఇప్పటి వరకు పెట్టలేదు. పైగా సన్ పిక్చర్స్ తో ఒకసారి సినిమా చేస్తే.. తర్వాత కంటిన్యూ అవుతారనే టాక్ ఉంది. ఇప్పుడు బన్నీ కూడా అట్లీతో సినిమా తర్వాత మరో రెండు సినిమాకు సన్ పిక్చర్స్ కు డేట్లు ఇవ్వబోతున్నాడంట. ఇదే టాక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నటీనటులకు అనుకూలంగా ఉంటారు. అందుకే బన్నీ కూడా ఆయన నడవడిక బాగా నచ్చి ఇంకో రెండు సినిమాలకు కమిట్ అవుతున్నట్టు తెలుస్తోంది.
Read Also : Anushka vs Rashmika : అనుష్క ముందు రష్మిక నిలబడుతుందా..?
