ప్రస్తుతం పాన్ ఇండియా మొత్తంలో పుష్ప 2 సినిమాపై ఉన్నంత హైప్ మరో ప్రాజెక్ట్ పై లేదని చెప్పడం అతిశయోక్తి కాదేమో. ఆ అంచనాలని అందుకే ప్రయత్నంలో సుకుమార్ అండ్ టీం ఎంతో కష్టపడి పుష్ప 2 సినిమా షూట్ చేస్తున్నారు కానీ ఒక్క అఫీషియల్ అప్డేట్ ని మాత్రం ఇవ్వట్లేదు. పుష్ప ది రూల్ అప్డేట్ ఇవ్వండని అభిమానులు అడుగుతుంటే ‘తగ్గేదే లే’, ‘అస్సలు తగ్గేదే లే’ అని చెప్పి మాట దాటేస్తున్నారు పుష్ప టీం. అయితే ఈసారి మాత్రం నిజంగానే తగ్గేదే లే అప్డేట్ ఇచ్చి తీరుతాం అంటున్నారు పుష్ప 2 మేకర్స్. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు ఉంది కాబట్టి ఆ రోజున పుష్ప 2 అప్డేట్ ఇచ్చి పాన్ ఇండియా బజ్ జనరేట్ చెయ్యాలనేది సుకుమార్ ప్లాన్. ఇక్కడి నుంచి పుష్ప 2 ప్రమోషన్స్ ని అఫీషియల్ గా స్టార్ట్ చెయ్యనున్నారు. అయితే పుష్ప అప్డేట్ లో భాగంగా గ్లిమ్ప్స్ బయటకి వస్తుందా? పోస్టర్ వస్తుందా? లేక స్పెషల్ వీడియోని రిలీజ్ చేస్తారా అనే విషయంలో మాత్రం ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు.
ఇక షూటింగ్ విషయానికి వస్తే ఏప్రిల్ 9న వైజాగ్ లో రెండు మూడు రోజుల పాటు ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేసి… తిరిగి హైదరాబాద్ లో పుష్ప 2 షూటింగ్ కంటిన్యు చెయ్యబోతున్నారని సమాచారం. ఫహద్ ఫాజిల్, అల్లు అర్జున్ ల మధ్య సీన్స్ ని త్వరలో జరగబోయే హైదరాబాద్ షెడ్యూల్ లో షూట్ చెయ్యనున్నారు. షెకావత్ సర్, పుష్ప రాజ్ మధ్య ఎలాంటీ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి? ఈ ఇద్దరి ఫేస్ ఆఫ్ సీన్స్ ఆడియన్స్ ని పాన్ ఇండియా రేంజులో ఎలా అలరిస్తాయి? పుష్ప ది రైజ్ మ్యాజిక్ ని పుష్ప ది రూల్ రిపీట్ చేస్తుందా? పుష్ప 2 నుంచి వచ్చే అప్డేట్ ఏంటి? అనే విషయాలు తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చెయ్యకతప్పదు.