Allu Arjun: ఇదేం వాడకం రా అయ్యా.. ఆ వీడియోని కూడా వదలడం లేదుగా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun Fake Video Promoting Congress goes Viral: లోక్‌సభ ఎన్నికల హడావుడి ఇలా మొదలయిందో లేదో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సెలబ్రిటీల డీప్‌ఫేక్ వీడియోలు తెర మీదకు వస్తున్నాయి.. వాళ్ళు ఏ పార్టీకి ప్రచారం చేయకున్నా చేస్తున్నట్టుగా ఉన్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీపికా పదుకొణె, అలియా భట్, కాజోల్, రష్మిక మందన్నల వీడియోలు వైరల్ అయిన తరువాత ఇప్పుడు ఏప్రిల్ 22 సోమవారం నాడు నటుడు అల్లు అర్జున్ ఉన్న క్లిప్ కూడా వైరల్ అయ్యింది. ఈ క్లిప్‌ను షేర్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్టు కామెంట్స్ పెడుతున్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి తండ్రి కంచర్ల కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో ఉండడంతో అది నిజమే అనుకునే అవకాశం కూడా ఉంది.
Suriya 44: సూర్య సినిమా నటించాలని ఉందా?.. ఇలా చేయండి!
Also Read
- Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. 'RX100' తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
- Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్‌కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
- Ajay Bhupathi: 'మంగళవారం'లో హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ క్యారెక్టర్‌పై డైరెక్టర్ అజయ్ భూపతి షాకింగ్ కామెంట్స్..
- Fauji vs King: బాక్సాఫీస్ వార్.. ప్రభాస్ 'ఫౌజీ' vs షారుఖ్ 'కింగ్'.. వెయ్యి కోట్ల వేటలో విజేత ఎవరు?
అయితే అసలు విషయం ఏమిటా అని పరిశీలిస్తే వైరల్ అవుతున్న వీడియోలో, అల్లు అర్జున్ ఓపెన్-టాప్ కారులో నిలబడి, ప్రజలను చూస్తూ నవ్వుతూ కనిపించాడు. పక్కనే ఆయన భార్య స్నేహారెడ్డి కూడా కనిపిస్తున్నారు. ‘కాంగ్రెస్ కోసం అల్లు అర్జున్ ప్రచారంలో ఉన్నారు’ అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేశారు. అల్లు అర్జున్ భారతదేశపు అతిపెద్ద సూపర్ స్టార్. ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు అంటూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు. అయితే అసలు విషయం అది కాదు. ఈ వీడియో వాస్తవానికి 2022 నాటిది, అల్లు అర్జున్ న్యూయార్క్‌లో ఉన్నప్పుడు, అక్కడ యుఎస్‌లోని ఎన్నారైలు నిర్వహించిన అత్యంత ప్రసిద్ధ వార్షిక ఈవెంట్‌లలో ఒకటైన ‘ఇండియా డే పరేడ్’లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత అల్లును ‘గ్రాండ్ మార్షల్’ బిరుదుతో అక్కడి వారు సత్కరించారు.
कांग्रेस के सम्मान में अल्लू अर्जून मैदान में।@alluarjun #Elections2024 pic.twitter.com/7DUvAyjbLf
— Er. Priyanka Jha (@JhaPriyankha) April 20, 2024
ఈ సందర్భంగా ఆయన ఆ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఇందులో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుపుకున్నారు. పరేడ్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన వీడియోను పోస్ట్ చేస్తూ, అల్లు ఇన్‌స్టాగ్రామ్‌లో, ‘న్యూయార్క్‌లో జరిగిన ఇండియా డే పరేడ్‌లో గ్రాండ్ మార్షల్ కావడం గౌరవంగా ఉంది’ అని షేర్ చేసుకున్నారు. గత కొన్ని నెలలుగా, అమీర్ ఖాన్, రష్మిక మందన్న – కత్రినా కైఫ్ యొక్క డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కనిపించాయి. తాజాగా రణ్‌వీర్ సింగ్ డీప్‌ఫేక్ వీడియో కూడా ఒకటి వైరల్ అయింది. అనంతరం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అల్లు అర్జున్ ఇప్పుడు ‘పుష్ప 2: ది రూల్’లో కనిపించనున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చిత్రం ‘పుష్ప 1: ది రైజ్’ తరువాత కథతో రానుంది. ఈ సినిమా ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!