Site icon NTV Telugu

Allu Aravind : బన్నీవాసును పొట్టుపొట్టు తిట్టిన అల్లు అరవింద్..

Bunny Vasu News

Bunny Vasu News

Allu Aravind : నిర్మాత బన్నీవాసు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ లో ఉంటున్నాడు. గతంలో చాలా సైలెంట్ గా ఉండే ఈయన.. ఈ మధ్య కాస్త వివాదాస్పదంగా మాట్లాడుతున్నాడు. మొన్న మిత్రమండలి మూవీ ఈవెంట్ లో తనను తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారని… తనపై చేస్తున్న కుట్రలు అన్నీ తన వెంట్రుకతో సమానం అన్నాడు. అంతకు మించి ఓ బూతు మాట కూడా మాట్లాడాడు. ఆయన కామెంట్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో దారుణమైన ట్రోల్స్ కూడా నడిచాయి. ఆ కామెంట్లపై నిర్మాత అల్లు అరవింద్ క్లాస్ పీకాడంట. పొట్టు పొట్టు తిట్టాడంట. ఈ విషయాన్ని కూడా స్వయంగా బన్నీవాసు అందరి ముందే చెప్పాడు.

Read Also : Star Heroine’s : ఇల్లీగల్ ఎఫైర్స్ తప్పు కాదు.. స్టార్ హీరోయిన్స్ ఇలా అన్నారేంటి

తాజాగా రష్మిక ప్రధాన పాత్రలో అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు బన్నీ వాసు వచ్చాడు. ఇందులో బన్నీ వాసు మాట్లాడబోతుంటే.. నిర్మాత ఎస్కేఎన్ కలగజేసుకుని ఇప్పుడు బన్నీ ఒక అగ్రెసివ్ స్పీచ్ ఇస్తాడన్నారు. బన్నీ మాట్లాడుతూ.. అగ్రెసివ్ లేదు, కాంట్రవర్సీ లేదు. ఆ కాంట్రవర్శీకి అల్లు అరవింద్ గారి నుంచి తిన్న తిట్లు మా నాన్న దగ్గరి నుంచి కూడా తినలేదు. చాలా కూల్ గా మాట్లాడుతాను, ఒళ్లు దగ్గర పెట్టుకుని స్పీచ్ ఇస్తా అన్నాడు. ఏదైనా వైరల్ కంటెంట్ ఇవ్వు అని అరవింద్ అనడంతో.. వైరల్ కంటెంట్ ఇవ్వమంటారు మళ్లీ ఆయనే వైర్ పట్టుకుని కొడతారు అని బన్నీవాసు అనడంతో అంతా నవ్వేశారు.

Read Also : Chiranjeevi : చిరంజీవి పేరు తప్పుగా వాడితే ఇక అంతే!

Exit mobile version