Site icon NTV Telugu

Allu Aravind : అల్లు అరవింద్ కు ఈడీ ప్రశ్నల వర్షం..

Allu Aravind

Allu Aravind

Allu Aravind : సినీ నిర్మాత అల్లు అరవింద్ కు ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఎన్నడూ ఎలాంటి కేసుల్లో ఇరుక్కోని అరవింద్ సడెన్ గా ఈడీ ముందు హాజరుకావడం సంచలనం రేపింది. ఆయన్ను మూడు గంటల పాలు అధికారులు ప్రశ్నించారు. ఓ బ్యాంక్ స్కామ్ లో ఆయన్ను ప్రశ్నించారు 2018- 19 మధ్య రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అండ్ రామకృష్ణ టెలోక్ట్రానిక్స్ పేరుతో రెండు సంస్థలు ఏర్పాటు చేశారు. ఈ రెండు సంస్థలు కలిసి యూనియన్ బ్యాంక్ నుంచి 101 కోట్ల రుణాలు తీసుకున్నాయి. ఈ తీసుకున్న రుణాలను సొంత అవసరాలకు వాడుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పైగా తీసుకున్న లోన్ కూడా కట్టలేదు. ఈ రెండు సంస్థలు కొన్న ఆస్తుల్లో, చేసిన లావాదేవీల్లో అల్లు అర్జున్ పేరు ప్రముఖంగా ఉంది.

Read Also : MLA Payal Shankar: ప్రజలను కాంగ్రెస్ చేసినంత మోసం ఏ పార్టీ మోసం చేయలేదు..

అందుకే ఈ రోజు ఆయన్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. వచ్చేవారం మరోసారి విచారణకు హాజరణకు రావలంటూ నోటీసులు ఇచ్చారు. ఈ విచారణ మీద అల్లు అరవింద్ ఏమీ స్పందించలేదు. ఈ స్కాంకు సంబంధించి అరవింద్ ఎంత వరకు ఇన్వాల్వ్ అయ్యారు అనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు అల్లు అరవింద్ పేరు ఇలాంటి కేసుల్లో వినిపించలేదు. ఇప్పుడు సడెన్ గా ఎందుకు ఇలా జరిగిందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ పై వరుసగా సినిమాలను నిర్మిస్తున్నాడు అల్లు అరవింద్. ఎప్పుడూ వివాదాల జోలికి పోకుండానే ఉంటాడు. మరి ఈ సంస్థతో అరవింద్ కు ఏం సంబంధమో ఎవరికీ అర్థం కావట్లేదు. త్వరలోనే అరవింద్ నుంచి దీనిపై సమాధానం వస్తుందని అంటున్నారు.

Read Also : Dmart: ఎంతకు తెగించావయ్య.. ఇలాచి దొంగ.. వెరీ స్పైసి..

Exit mobile version