Allu Arjun : అల్లు అర్జున్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా ఇండియా రేంజ్ లో దూసుకుపోతున్నాడు. పుష్ప సినిమా తర్వాత ఆయనకు పాన్ ఇండియా మార్కెట్ బాగా పెరిగింది. ఇప్పుడు ఒక్క సినిమా తీస్తే 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. వందల కోట్ల బిజినెస్ చేస్తోంది ఆయన సినిమా. అయితే ఈ స్థాయిలో బన్నీ సినిమాలు చేస్తుంటే.. ఆయన వల్ల అల్లు అరవింద్ 40 కోట్లు నష్టపోయాడు. ఇది ఇప్పుడు కాదు గతంలోని మ్యాటర్. ఈ విషయాన్ని అల్లు అరవింద్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అల్లు అర్జున్ హీరోగా వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ బద్రీనాథ్. అయితే ఈ సినిమాను ముందు అల్లు అరవింద్ రిజెక్ట్ చేశాడంట. కానీ అల్లు అర్జున్ ఇందులోని యాక్షన్ సీన్స్ కోసం పట్టుబట్టి మరి చేశాడు.
Read Also : Bigg Boss 9 : డిప్యూటీ సీఎం చొరవతో తెరుచుకున్న బిగ్ బాస్..
ఈ సినిమా రిజల్ట్ ఎందుకో తేడా కొడుతుందని ముందు నుంచి అరవింద్ చెబుతూనే ఉన్నాడంట. సినిమాకు బడ్జెట్ అనుకున్న దానికంటే రెండింతలు ఎక్కువైంది. అప్పుడున్న బన్నీ మార్కెట్ కుమించి బడ్జెట్ అయింది. రిలీజ్ కి ముందు కూడా అరవింద్ కు ఈ సినిమా గురించి తేడాగానే ఉందని అనిపించింది. అనుకున్నట్టుగానే సినిమా డిజాస్టర్ అయింది. బడ్జెట్ భారీగా ఉండడంతో నష్టాలు ఎక్కువగానే వచ్చాయి. ఆ సినిమాకు ఎంత లేదన్న 40 కోట్ల వరకు నష్టాలు వచ్చాయని అల్లు అరవింద్ స్వయంగా తెలిపాడు. ఆ దెబ్బతోనే చాలా రోజులు పెద్ద సినిమాలు నిర్మించలేదని స్పష్టం చేశాడు. తిరిగి కోలుకోవడానికి కొంచెం టైం పట్టిందని.. కెరీర్ లో ఇలాంటి అనుభవాలు కూడా మంచివే అంటూ తెలిపాడు అరవింద్. మరోసారి జాగ్రత్త పడేందుకు ఇది ఉపయోగపడింది అన్నారు.
Read Also : Krithi Shetty : నడుము అందాలతో గత్తర లేపిన కృతిశెట్టి
