NTV Telugu Site icon

Allu Aravind: కెజిఎఫ్ లేకపోతే యశ్ ఎవరు.. ? ఎంత పెద్ద హీరో అతను..?

Aravind

Aravind

Allu Aravind: శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మీ శరత్‌ కుమార్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం కోటబొమ్మాళీ పీఎస్. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ (గీతా ఆర్ట్స్) బ్యానర్‌‌పై బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. మలయాళ సూపర్ హిట్ సినిమా నాయట్టు కు అధికారిక రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నేడు ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో చిత్ర బృందంతో పాటు.. నిర్మాత అల్లు అరవింద్ కూడా పాల్గొన్నాడు. ఇక ఆయనకు కూడా చాలా ప్రశ్నలను సంధించారు జర్నలిస్టులు. ముఖ్యంగా గీతా ఆర్ట్స్ సంస్థ నుంచి చిన్న చిన్న సినిమాలు తప్ప పెద్ద సినిమాలు ఎందుకు రావడం లేదు అన్న ప్రశ్నకు.. ” నిర్మాణ వ్యయం దానికి కారణం కాదు.. సినిమా నిర్మాణ వ్యయం విషయానికి వస్తే అందరూ చెప్పేది హీరోల రెమ్యునరేషన్ గురించే” అని చెప్పుకొచ్చాడు. ఇక దానికి కొనసాగింపుగా అత్యధిక రెమ్యూనిరేషన్ తీసుకొనే హీరో మీ ఇంట్లోనే ఉన్నాడుగా.. అని అడుగగా.. దానికి అల్లు అరవింద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

Katrina Kaif: టవల్ ఫైట్.. ఆవిరి నిండిన గదిలో ఎలా చేశామంటే ..?

“చెప్పాలంటే.. నిర్మాణ వ్యయంలో హీరోలు తీసుకోలేం రెమ్యూనిరేషన్ కేవలం అత్యధికంగా 20 నుంచి 25 శాతం. అందుకే హీరోల వల్ల ఖర్చు పెరిగిపోతుంది అనడం కన్నా.. పెంచిన సినిమాల్లో హీరోలు ఉంటున్నారు అని అనిపిస్తుంది నాకు. పేర్లు చెప్తే బాగోదు.. కొన్ని సినిమా నిర్మాణ వ్యయాలు ఎంతున్నాయో మీరు గమనించండి. తక్కువే ఉన్నాయి. హీరోలతో సంబంధం లేకుండా ఇవాళ పెద్దగా చూపిస్తే తప్ప పెద్ద సినిమాలను ప్రేక్షకులు ఆదరించరు. కెజిఎఫ్ రాకముందు అతను (యశ్) ఎవరు.. ? ఎంత పెద్ద హీరో అతను? సినిమాను పెద్దగా చూపించారు కాబట్టే ఆ సినిమా ఆడింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.