అల్లరి నరేష్.. కెరీర్ స్టార్టింగ్ నుంచి కామెడీ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చారు. కానీ కొంత కాలానికి కామెడీ కూడా వర్కౌట్ కాలేదు. దీంతో ‘నాంది’ సినిమా నుంచి అల్లరోడు యూటర్న్ తీసుకున్నారు. అక్కడి నుంచి కాస్త సీరియస్ సినిమాలు చేస్తు వస్తున్నారు. ఈ నేపథ్యంలో లేటెస్ట్‌గా ’12A రైల్వే కాలనీ’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చారు. అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ చిత్రానికి పొలిమేర దర్శకుడు అనిల్ కథ అందించగా.. నాని అనే కొత్త దర్శకుడు పరిచయమయ్యారు.
క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన 12A రైల్వే కాలనీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేక పోయిందనే చెప్పాలి. కొన్ని చోట్ల మాత్రమే మెప్పించే థ్రిల్లర్ అనే రివ్యూస్ సొంతం చేసుకుంది. ఆడియెన్స్ కూడా ఈ సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అన్నట్టుగానే ఉంది. దీంతో 12A రైల్వే కాలనీ కూడా అల్లరి నరేష్‌ని హిట్ ట్రాక్ ఎక్కించడం కష్టమే అని చెప్పాలి. కానీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు అల్లరోడు.
Also Read: Prabhas: పెద్ద ప్లానింగే.. ప్రభాస్ ‘ప్రీక్వెల్’ ఫిక్సా?
అల్లరి నరేష్ లిస్ట్‌లో ఉన్న సినిమాల్లో ‘ఆల్కహాల్’ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో నరేష్ సక్సెస్ ట్రాక్ ఎక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ చేస్తే కామెడీ సినిమాలే, లేదంటే సీరియస్ సినిమాలే అన్నట్టుగా చేస్తున్నారు నరేష్. ప్రస్తుతం ఆడియెన్స్ సినిమాలు చూసే విధానం మారింది. కంటెంట్ బలంగా ఉంటేనే థియేటర్లకు వెళ్తున్నారు. కాబట్టి నరేష్ కాస్త కంటెంట్ ఉన్న సినిమాలపై దృష్టి పెడితే బెటర్.