All the issues related to Ooru Peru Bhairavakona movie cleared: సందీప్ కిషన్ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఊరు పేరు భైరవకోన” సినిమా విడుదలను నిలుపుదల చేయాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో విశాఖపట్నంకు చెందిన ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) కేసు వేసిన సంగతి తెలిసిందే. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్, ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ అధినేతలు, ప్రముఖ నిర్మాతలు అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ తనను నమ్మించి మోసం చేశారని బత్తుల సత్యనారాయణ (సతీష్, వైజాగ్ ) అందులో పేర్కొన్నారు. ఆ మధ్య వచ్చిన “ఏజెంట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు మూడు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకలకు ఐదు సంవత్సరాల పాటు తనకు చెందిన గాయత్రి దేవి ఫిలిమ్స్ కు అందజేస్తామని అగ్రిమెంట్ నాకు రాసిచ్చి, తన వద్ద నుంచి 30 కోట్ల రూపాయలు తీసుకుని, అగ్రిమెంట్ ప్రకారం హక్కులు ఇవ్వకుండా వారు మోసగించారని పేర్కొన్నారు.
Ooru Peru Bhairavakona: ప్రీమియర్స్ కి సూపర్ రెస్పాన్స్.. భారీ ఎత్తున కలెక్షన్స్
మూడు రాష్ట్రాలకు కాకుండా కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే హక్కులు ఇచ్చారని, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తదుపరి సినిమా విడుదలకు ముందు నా డబ్బులు చెల్లిస్తామని, లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ ఇచ్చి కూడా వారు సమాధానం చెప్పడం లేదని అన్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో నేను న్యాయం కోసం కోర్టుకు ఎక్కానని చెప్పారు. తన డబ్బులు ఇచ్చేంతవరకు సినిమా విడుదల కాకుండా స్టే విధించాలని కోరుతూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో (OS NO: 658/ 2024) కేసు వేసిన నేపథ్యంలో గురువారం వాదనలు జరిగాయి. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు న్యాయమూర్తి సినిమా మీద స్టే విధించే కేసును ఏప్రిల్ 12కి వేశారు. దీంతో ఇప్పటివరకు సినిమాకు ఉన్న అడ్డంకులు తొలగినట్టు అయింది.