Site icon NTV Telugu

Raj Tarun Lavanya : రాజ్ తరుణ్ – లావణ్య కేసులో లాయర్ కళ్యాణ్ సంచలన విషయాలు

Raj Tarun Case

Raj Tarun Case

Raj Tarun Lavanya : రాజ్ తరుణ్- లావణ్యల ఇష్యూ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ తనని మోసం చేశాడు అంటూ లావణ్య పోలీసులను ఆశ్రయించింది. అలాగే రాజ్ తరుణ్ కు హీరోయిన్ మాల్వి మల్హోత్రాకు సంబంధం ఉందని.. మాల్వి మల్హోత్రా కోసమే తనను దూరం పెట్టాడు అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత తనకు అబార్షన్ చేయించాడు అంటూ మరో బాంబు కూడా పేల్చింది. ఇప్పుడు లావణ్యకు ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది కల్యాణ్ దిలీప్ సుంకర అండగా నిలిచాడు. కళ్యాణ్ దిలీప్ సుంకర.. ఒకప్పుడు జనసేన పార్టీ కోసం పని చేసిన లాయర్ కూడా. కొన్ని పేరున్న కేసులు డీల్ చేయడం ద్వారా అతను పాపులారిటీ సంపాదించాడు. నాగబాబు తనయురాలు నిహారికకు విడాకులు ఇప్పించింది కూడా అతడే. ప్రస్తుతం కళ్యాణ్ టేకప్ చేసిన కేసు హాట్ టాపిక్‌గా మారింది.

Read Also:Gannavaram: బాపులపాడు హైవేపై నిలిచిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది.. !

హీరో రాజ్ తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రతిగా లావణ్య మీద రాజ్ అనేక ఆరోపణలు చేశాడు. అతను కూడా లావణ్య మీద ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పాడు. ఈలోపు రాజ్‌తో సంబంధం ఉందని లావణ్య ఆరోపిస్తున్న మాల్వి మల్హోత్రా అనే ముంబయి అమ్మాయి.. లావణ్య మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడీ కేసులోకి దిలీప్ సుంకర ఎంట్రీ ఇచ్చాడు. అతను లావణ్య తరఫున కేసును టేకప్ చేశాడు. రాజ్ మీద చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలంటూ నార్సింగి పోలీసులు లావణ్యకు నోటీసులు ఇవ్వగా.. ఆమె లాయర్ అయిన దిలీప్ సుంకర ఈ పని పూర్తి చేశాడు. ఏకంగా 120కి పైగా కాల్ రికార్డ్స్‌తో పాటు అనేక ఫొటోలు, వీడియోలు పోలీసులకు సమర్పించినట్లు దిలీప్ మీడియాతో చెప్పాడు.

Read Also:RC16: ‘కరునాడ చక్రవర్తి’కి స్వాగతం.. శివన్న లుక్ వైరల్!

రాజ్ తరుణ్.. లావణ్యతో సహజీవనం చేసి మోజు తీరాక వదిలించుకోవాలని భావిస్తున్నట్లు దిలీప్ సుంకర ఆరోపించాడు. వీళ్లిద్దరికీ పెళ్లి కూడా జరిగిందని.. విడాకుల కోసం రాజ్ ప్రయత్నించాడు అనడానికి బలమైన ఆధారాలు ఉన్నాయంటూ అతడు చెప్పుకొచ్చాడు. లావణ్యకు బలవంతంగా అబార్షన్ చేయించిన సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను ఆమె తనకు చూపించిందని వాటిని మీడియా ముందు ప్రదర్శించాడు. కేసు వాపస్ తీసుకుంటే ఐదు కోట్లు ఇస్తామంటూ రాజ్ వైపు నుంచి ప్రపోజల్స్ పెట్టిన మెసేజ్‌లు, కాల్ రికార్డ్స్ ఉన్నాయని, రాజ్ డ్రగ్స్ కేసులో లావణ్యను ఎలా ఇరికించడానికి చూశాడు.. ఆమె మీద ఎలా ఎటాక్ చేయించాడు.. ఇలా అనేక విషయాల్లో ఆధారాలున్నాయని.. అవన్నీ పోలీసులు, కోర్టుకు ఇస్తున్నామని.. ఈ కేసులో రాజ్ తరుణ్ రిమాండుకు వెళ్లడం ఖాయమన్నాడు. తమ ఆరోపణలపై మీడియా ముందు చర్చకు కూడా సిద్ధమని రాజ్, మాల్విలకు దిలీప్ సుంకర సవాలు విసిరాడు.

Exit mobile version